ప్రపంచం మొత్తం కరోనా భయంతో వణికిపోతుంది.  మొన్నటి వరకు చైనాలో ఉన్న ఈ కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంతో అన్ని దేశాలు జాగ్రత్తలు పడుతున్నాయి.  అయితే భారత్ లో కూడా కరోనా ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే 128 మందికి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.  ఈ నేపథ్యంలో క్రేందం అన్ని రాష్ట్రాలకు తగు సూచనలు, సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే.  తెలంగాణ ఇతర రాష్ట్రాలు ఇప్పటిే పాఠశాలలు, మాల్స్, థియేటర్లు, క్లబ్బులు ఇతర అన్ని జనసంద్రంగా ఉండే ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. 

 

తాజాగా మహారాష్ట్రలో ఈ కరోనా ప్రభావం బాగా ఉందని అంటున్నారు.  ఇక కరోనా ప్రభావంతో ఉత్తర్ ప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.  తాజాగా యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం ఒకటి నుంచి 8 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే, అందరూ ఉత్తీర్ణులయినట్టు ప్రకటించింది.  విద్యా శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రేణుకా కుమార్, ఈ మేరకు గత రాత్రి ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు.

 

యూపీలో మార్చి 23 నుంచి 28 వరకూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సి వుంది. "విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని ఆదేశాలు జారీ చేశాము. ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. అన్ని పాఠశాలలూ ఏప్రిల్ 2 వరకూ మూసివేయబడి వుంటాయి.  మిగతా బోర్డు పరీక్షలు ఎప్పుడు జరపాలన్న విషయమై ఏప్రిల్ 2 తరువాత నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు యూపీ సీఎం తీసుకున్న నిర్ణయం  అందరి దృష్టి ఆకర్షిస్తుంది.  ఏది ఏమైనా భారత్ లో కరోనా ప్రభావం వల్ల అన్ని వర్గాల నుంచి స్పందన వస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: