కరోనా వైరస్... కరోనా వైరస్... ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎదురుకుంటున్న సమస్య. నేటితో ప్రపంచ వ్యాప్తంగా మొత్తానికి 2 లక్షల మందికి ఈ వ్యాధి సోకింది. అందులో 8000 పైగా ప్రజలు మరణించారు. ఇక వైరస్ మనదేశంలో కూడా రోజుజుకి తన విశ్వరూపాన్ని చూపుతుంది. ప్రస్తుతం దేశంలో 140 కి పైగా కరోనా వ్యాధిని పడ్డారని అధికారులు చెబుతున్నారు. ఇందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కూడా తెలిసిన సంగతే.

IHG

 

అయితే ప్రస్తుతం ఈ వైరస్ దెబ్బతో నగరాలలో ఉన్న మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ లు ఇంకా అనేక రకాల జనసమూహాలు జరిగే వాటిపై పడింది. ఇదే పరిస్థితి ఇప్పుడు దేవాలాలయాలపై కూడా పడింది. దీనితో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో నమ్మకుమున్న చిలుకూరి బాలాజీ టెంపుల్ పై కూడా పడింది. ఈ వైరస్ దెబ్బకి ఆలయానికి వచ్చే భక్తులని ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా రేపటి నుండి ఆలయాన్ని మూసివేయనున్నారు.

 

IHG


ఆలయాన్ని మూసి వేయడమంటే పూర్తిగా కాకుండా భక్తులకి మాత్రం అనుమతించరు అంతే, స్వామి వారికి రోజువారి పూజలు, నైవేద్యాలను పూజారులు మాములుగా సమర్పిస్తారు మార్చి 19 నుండి మార్చి 25 వరకు ఆలయాన్ని మూసి వేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. దింతో భక్తులెవరు ఆలయానికి 25వ తేదీవరకు రావడాన్ని ప్రధాన అర్చకులు భక్తులకి సూచించారు. అలాగే భక్తులని ఇంట్లోనే ఉంది కరోనా వైరస్ ని తొందరగా నివరంచాలని దేబూడికి పూజలు చేయాలనీ ఆలయ ప్రధాన అర్చకులు ఈ సందర్బంగా ఆయన తెలిపారు. ఏది ఏమైనా ఈ కరోనా వైరస్ సగటు మనిషి జీవితాన్ని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: