తల్లిదండ్రుల తరవాత గురువునే దైవంగా కొలుస్తారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కోచింగ్ ఇచ్చి ప్రపంచ స్ధాయి బాక్సర్లుగా తీర్చి దిద్దాల్సిన  గురువులు స్టూడెంట్స్ పై లైంగిక వేధింపులు పాల్పడుతుంటే కొత్త ఆటగాళ్లు ఎక్కడినుంచి తయారవుతారు ? టోర్నమెంట్ కు వెళ్లిన సమయంలో కోచ్ తనను లైంగికంగావేధించాడని మహిళా బాక్సర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ కోచ్ ను అరెస్టు  చేశారు. 

 

కొల్ కత్తాలో జరిగే బాక్సింగ్ టోర్నమెంట్ లో పాల్గోనేందుకు ఫిబ్రవరి 27న ఢిల్లీ నుంచి కొల్ కతా వెళుతుండగా తమతో పాటు ప్రయాణించిన కోచ్(28) తనపై లైంగిక దాడి చేసినట్లు 19 ఏళ్ల మహిళా బాక్సర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొల్ కతాలో ఉన్న సమయంలోకూడా కోచ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో వివరించింది.

 

ఢిల్లీలోని సోనాపేట్ ప్రాంతానికి చెందిన సందీప్ మాలిక్ ఓ ప్రొఫెషనల్ బాక్సర్. పలు ప్రైవేటు బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్నాడు. ప్రస్తుతం సోనాపేట్ ప్రాంతంలో బాక్సింగ్ ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పి శిక్షణ ఇస్తున్నాడు. అతని వద్ద బాక్సింగ్ నేర్చుకుంటున్న ఓ యువతిపై కన్నేసిన కోచ్ నీచానికి దిగాడు.

 

దింతో మహిళా బాక్సర్ హర్యానా తరుఫున టోర్నమెంట్ లో పాల్గోంది. ఆమె తన కోచ్ పై పోలీస్ కేసు పెట్టింది. ఫిర్యాదు నమోదు చేసుకున్నపోలీసుల కోచ్ ను  హర్యానాలోని సోనిపట్ లో అరెస్టు చేశారు.  విచారణలో  బాక్సర్ న వేధించినట్లు కోచ్ అంగీకరించాడని పోలీసుల తెలిపారు.

 

అయితే బాధితురాలిపై ట్రైన్‌‌లో అత్యాచారం జరగడంతో ముందుగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. ఆ తరువాత కేసును రైల్వే పోలీసులకు ట్రాన్స్‌ఫర్ చేశారు. యువతిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. రేప్ జరిగినట్లు నిర్ధారణ అవడంతో నిందితుడిపై రేప్ కేసు కింద కేసు నమోదు చేశారు.

నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపరిచారు. మహిళా బాక్సర్‌పై అత్యాచారానికి పాల్పడినట్టు కోచ్ ఒప్పుకున్నట్లు సమాచారం. బాక్సింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోని పలువురిని కూడా లైంగికంగా వేధించాడన్న ఆరోపణలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: