ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జంపింగుల ప‌ర్వం, ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ వంటివి కొన‌సాగుతున్నాయి. ఎవ‌రికి వారు ఎ క్క‌డిక‌క్క‌డ పార్టీ మారుతున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్షం టీడీపీలో సీనియ‌ర్లు పార్టీ నుంచి బ‌య‌ట‌కు పోతు న్నారు. దీంతో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. స‌రే.,. ఇప్పుడు గ‌డిచి న రెండు వారాల్లో టీడీపీ నుంచి కీల‌క నాయ‌కులు క్యూక‌ట్టుకుని బ‌య‌ట‌కు వ‌చ్చారు. ప్ర‌స్తుతం మ‌రో కీల‌క నాయ‌కుడు కూడా రేపో మాపో పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. ఆయ‌నే మాజీ మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు. శిద్ధా చంద్ర‌బాబుకు ఎంత క్లోజో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.



గ‌త 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నుంచి విజ‌యం సాధించ‌డం, అనంత‌రం చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రి పీఠం సంపాయించ‌డం తెలిసిందే. అయితే, గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం దీనికి భిన్నంగా ఆయ‌న‌ను ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించ‌డంతో ఆయన ప‌రాజ‌యం పాల‌య్యారు. త‌న‌ను ఉ ద్దేశ పూర్వ‌కంగానే చంద్ర‌బాబు ఒంగోలు నుంచి పోటీ చేయించి త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును అడ్డుకున్నార నే ఆగ్ర‌హం ఆయ‌న‌లో ఉంది. ఈ క్ర‌మంలోనే అప్ప‌టి నుంచి ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటు న్నారు. ముఖ్యంగా త‌న కుమారుడికి భ‌విష్య‌త్తు కోసం తపించారు.



ఇక‌, ఇప్పుడు టీడీపీ మ‌రింత‌గా ప్ర‌భావం కోల్పోతుండ‌డం, ఇప్ప‌ట్లో పుంజుకునే అవ‌కాశం కూడా లేక‌పోవ డంతో శిద్దా కూడా పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. ఈ క్ర‌మంలో నే తాజాగాఆయ‌న సోద‌రుల కుమారుల ను వైసీపీలోకి పంపార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఇక‌, శిద్దా కూడా త్వ‌ర‌లోనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటార‌ని అంటున్నారు. అయితే, ద‌ర్శిలో ఇప్ప‌టికే వైసీపీ నాయ‌కుడు ఉండ‌డం, ఇప్ప‌డు శిద్దా కూడా పార్టీ మారి వైసీపీలోకి చేరితే.. ఇక్క‌డ రెండు అధికార కేంద్రాలు ఏర్ప‌డితే.. ప‌రిస్థితి ఏంటి? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలోనూ శిద్దా చేరిక‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రి ఈ నేప‌థ్యంలో వైసీపీ అధినేత ద‌ర్శిలో ఎలాంటి వ్యూహం అమ‌లు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: