ఆయన అత్యున్నత పదవిలో ఉన్నారు. ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి. ఆయన తనకు తానే చెప్పుకున్నట్లుగా హైకోర్టు న్యాయమూర్తి అధికారాలు అన్నీ ఉన్న న్యాయ, ధర్మాధికారి. అటువంటి ఆయన హఠాత్తుగా స్థానిక ఎన్నికలను నిలుపుదల చేశారు. అది ఆయన విచక్షణాధికారం.

 

 

దాంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి సహా అందరూ ఆయన మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు. దీంతో వాటి మీద పరువు నష్టం దావా వేయాలని నిమ్మగడ్డ నిర్ణయించుకున్నారని అంటున్నారు. దానికి సంబధించిన వీడియా క్లిప్పింగులు, పేపర్ కటింగులను ఆయన సేకరిస్తున్నటుగా భోగట్టా.

 

 

తనను కులం పేరిట విమర్శించిన వారందరి  విషయంలోనూ నిమ్మగడ్డ ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. ఆయన  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో కూడా తనని వ్యక్తిగతంగా దూషించారని బాధపడిన సంగతి విధితమే.

 

ఇక చంద్రబాబు, ఆయన ఒకే కులం కాబట్టే ఇలా చేశారని ముఖ్యమంత్రి జగన్ విమర్శించగా, ఆయన నారావారి ఇంటి గబ్బిలం అని విజయసాయిరెడ్డి అన్నారు. ఇక ఆయన్ని కులపిచ్చి అంటూ వైసీపీ నేత కాపు రామాచంద్రారెడ్డి దూషించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఆయన్ని కులం పేరిట దూషించడమే కాకుండా గాడిదతో సంభోదించారు.

 

ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి మరీ పరువు నష్టం దావా వేయాలని నిమ్మగడ్డ అనుకుంటున్నారని తెలుస్తోంది. ఆయన డైరెక్ట్ గా కేసు వేస్తారా లేక ఆయన తరఫున ఎవరైనా కేసులు వేస్తారా అన్నది చూడాలి. మొత్తానికి నిమ్మగడ్డ ఈ వ్యవహారాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలనుకుంటారని అర్ధమవుతోంది. ఫలితాలు, పర్యవశానాలు ఎలా ఉంటాయో చూడాలి.

 

ఏది ఏమైనా ఏపీలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా సాగుతున్నాయి. వ్యక్తిగత ప్రయోజనాలుగా మారిపోతున్నాయి. ఇందులో ప్రజలు బలి పశువులు అవుతున్నారు. అందరూ ఇగోలతోనే ముందుకు సాగుతున్నారు లా ఉంది సీన్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: