ఎప్పటి నుండో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడాలని చూస్తున్నా బిజెపి పార్టీ మళ్లీ తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే అవకాశం కనబడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి పార్టీ తరఫున అభ్యర్థులు దొరకక పోవటం అదేవిధంగా దొరికిన అభ్యర్థులు నామినేషన్లు వేద్దాము అని భావించిన అవకాశం లేకపోవటం తో బిజెపి పార్టీ నాయకులు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దగ్గరవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినపడుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలలో కనీసం బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్న ఓటర్ ని ఏమాత్రం ప్రభావం చేయలేదు. దీంతో ఎక్కడా కూడా బిజెపి పార్టీ గత సార్వత్రిక ఎన్నికలలో ఏపీలో గెలవలేదు. 2014 ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న సందర్భంలో కొన్ని స్థానాలు గెలిచిన బిజెపి తర్వాత ఒంటరిగా పోటీ చేసిన ఏపీలో కనీసం ఖాతా కూడా తెరవలేదు.

 

ఇటువంటి పరిణామంలో ప్రస్తుతం జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న బిజెపి...ఆ పార్టీతో పెద్దగా లాభం లేదని భావిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రాలో ఉన్న బిజెపి నాయకులు తెలుగుదేశం పార్టీతో జతకట్టి గతంలో మాదిరిగా రాజకీయాలు చేయాలని అందులో భాగంగానే ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు డైరెక్షన్లో మాట్లాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మరికొంత మంది బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు కూడా టిడిపి పార్టీ తో ప్రత్యక్ష పరోక్ష స్నేహం చేస్తున్నారు.

 

తాము జగన్ తో రహస్యంగా స్నేహం చేసినా సరే దానితో రాజకీయంగా తమకు వచ్చే ఉపయోగాలు ఏమీ ఉండవని ఒక అంచనాకు వచ్చిన బీజేపీ పెద్దలు ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు కూడా ఇటీవల బీజేపీ పార్టీకి దగ్గర అవ్వాలని అనేక ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో తాజా పరిణామాలు ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం బీజేపీ స్టీరింగ్ మొన్నటివరకు వైసీపీ వైపు ఉందని ఇప్పుడు సడన్ గా టిడిపి వైపు మళ్లింది అన్న వార్తలు ఊపందుకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: