చంద్రబాబు పరిస్థితి రోజు రోజుకూ దిగజారి. 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజల చేత దారుణంగా ఛీ కొట్టించుకున్న చంద్రబాబు ఇప్పుడు సొంత పార్టీ నేతల చేతనే ఛీ కొట్టించుకున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా వార్తలు వినబడుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలలో ఏపీ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తే స్థానిక సంస్థల ఎన్నికల ముందే సొంత పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబుకి మరిచిపోయే విధంగా పార్టీ మారే కార్యక్రమాలు బలంగా జరుగుతున్నట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో  చంద్రబాబుని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా లైట్ తీసుకున్నట్లు ప్రస్తుత పరిణామాలు బట్టి తెలుస్తోంది. విషయంలోకి వెళితే ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడాన్ని గురించి యనమల రామకృష్ణుడు మాట్లాడటం జరిగింది.

 

‘ఎన్నికల సంఘం అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ. అలాంటి సంస్థ కరోనా నేపథ్యంలో తనకున్న అధికారాలకు లోబడి స్థానిక ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేసింది. దీనిని ప్రశ్నించడానికి ముఖ్యమంత్రికి ఏం అధికారం ఉందో జగన్ చెప్పాలి. రాజ్యాంగబద్ధ సంస్థలను అవమానించాలా మాట్లాడిన జగన్.. సీఎంగానే కాదు రాజకీయ నాయకుడిగా కూడా అన్ ఫిట్’ అంటూ కామెంట్లు చేశారు. ఇటువంటి తరుణంలో మరి 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కు సరిగ్గా ఒక్కరోజు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరించిన వైఖరి మాటేమిటి అన్న ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది.

 

గతేడాది ఏప్రిల్ 10న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ వద్దకు చంద్రబాబు వెళ్లి సృష్టించిన హంగామా మరచిపోయారా యనమలా అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న బాబు.. ద్వివేదీని బెదిరించినప్పుడు ఈసీ ఓ అత్యున్నత సంస్థ అన్న విషయం గుర్తులేదా అని నిలదీస్తున్నారు. మిమ్మల్ని ఈజీగా వదలను మీ సంగతి ఏంటో చూస్తా అంటూ చంద్రబాబు అప్పట్లో వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఈ విషయంలో చంద్రబాబు ని లైట్ తీసుకున్న యనమల జగన్ పై ఎందుకు ఆ విధంగా రెచ్చిపోతున్నారు అని వైసిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. మా నాయకుడు అడిగిన దానిలో న్యాయం ఉందని వైసీపీ నేతలు యనమల రామకృష్ణుడు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: