ఎదో ఒకచోట, ఎదో ఒక రకంగా, ఎవరో ఒకరి మీద కామాంధులు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. బంధుత్వాలు సైతం పక్కనపెడుతున్నారు.  వరసలు మర్చిపోతున్నారు.  చిన్న పిల్ల అని లేదు, పెద్ద పిల్ల అని లేదు దారుణాలకు తెగబడుతున్నారు. అభం శుభం తెలియని పసిమొగ్గలపై కూడా అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. కూతురు వరసయ్యే చిన్నారిపై సొంత బాబాయ్ అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన తాజాగా వెలుగుచూసింది.

 

ఈ అమానుషకర ఘటన గుంటూరులో జిల్లాలో కలకలం రేపింది.జిల్లాలోని పొన్నూరు పరిధి నిడుబ్రోలులో ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.  వరసకు కూతురు అవుతుంది. బాబాయ్ అని పిలుస్తుంది. ఒక్కోసారి చిన్నాన్న అనికూడా పిలుస్తుంది ఈ చిన్నారి.పిలుపులో ఉన్న ఆప్యాయత, అనురాగం మరిచిపోయాడు. చిన్నాన్న అన్న పిలువులో ఉన్న నాన్న అన్న మాటని మర్చిపోయి,  కామంతో చిన్నారిని పాడు చేసాడు.  కళ్లుమూసుకుపోయిన ఈ  కామపిశాచి తన  అన్న కూతురిని దారుణంగా రేప్ చేశాడు.

 

పాపం ఆ చిన్నారి ఏమి జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో నిస్సహాయంగా పడి ఉంది. అది గమనించిన  చిన్నారి తండ్రి  చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు గుర్తించి, ఆ దారుణనికి పాల్పడిన తమ్ముడిని చావబాది పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఇలాంటి ఘాతుకానికి అడిగట్టిన వ్యక్తి ని ఉరితీయాలని  స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 

ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.గతంలోనూ ఇలాంటి దారుణ ఘటనలు పొన్నూరు పరిధిలో చోటుచేసుకున్నాయి. చెల్లి వరసయ్యే మైనర్ బాలికను పాఠశాలకు వెళ్లి బైక్ ఎక్కించుకుని బీచ్‌కి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టిన సంఘటన వెలుగుచూసింది. పెద్దల సమక్షంలో హెచ్చరించినా తీరు మార్చుకోని యువకుడు.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో గోడ దూకి వచ్చి మరీ బాలికపై మరోమారు అత్యాచారం చేసిన ఘటన జరిగింది.

 

తాజాగా మరో ఘటన చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.పొన్నూరు పరిధిలో అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజు రోజుకి మితిమీరుతున్నాయి. దీనితో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఇక మీదట అయిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఎన్ని చట్టాలు తెచ్చిన, ఎన్ని శిక్షలు వేసిన మార్పు రావడం లేదు. అఘాయిత్యాలు ఆగడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: