తెలుగు న్యూస్ ఛానళ్లు పుట్టడం, మూసేయడం కొత్తేమీ కాదు.. గతంలోనూ ఎన్నో ఛానళ్లు నడపడం చాతకాక.. నడపలేక మూతబడ్డాయి. ఉద్యోగులను నట్టేట ముంచి.. అవీ మునిగిపోయాయి. ఇప్పుడు మరో తెలుగు ఛానల్ పరిస్థితి అలాగే కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వడం లేదట. సరే.. దాందే ముంది జీతాలు ఇవ్వాళ కాకపోతే రేపు వస్తాయి అన్న దీమాతో ఉద్యోగాలు పని చేయవచ్చు.. గతంలోనూ ఎన్నో ఛానళ్లు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా... ఆ తర్వాత గాడిలో పడ్డాయి.

 

 

కానీ ఈ ఛానల్ పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే.. ఏకంగా ఛానల్ ఛైర్మనే.. అయ్య బాబాయ్.. ఈ ఛానల్ తో నేను వేగలేను.. మీకో నమస్కారం అంటూ దండం పెట్టేస్తూ రాజీనామా చేసేశారు. దీంతో మరో తెలుగు న్యూస్ చానల్ సంక్షోభంలో కూరుకుపోయినట్టయింది. అసలు ఇంతకీ ఆ ఛానల్ ఏదో చెప్పలేదు కదా.. అదే మొట్టమొదటి సారి ఏపీ పేరు పెట్టుకుని పుట్టిన AP 24X7 న్యూస్ ఛానల్.. మురళీకృష్ణంరాజు ఈ ఛానల్ కు ఛైర్మన్. మురళీ కృష్ణం రాజుకు మీడియా రంగంలో మంచి పేరే ఉంది. మాటీవీని ప్రారంభించింది ఆయనే.

 

 

ఆ తర్వాత దాన్ని నిమ్మగడ్డ ప్రసాద్ కు అమ్మేశారు. ap 24X7 న్యూస్ ఛానల్ ను ఆయన మరికొంత మంది పెట్టుబడిదారులతో కలిసి ప్రారంభించారు. గతంలో ఈటీవీ, టీవీ5 వంటి సంస్థల్లో పని చేసిన వెంకట కృష్ణ, సాయి వంటి వారు ఈ ఛానల్ లో ఉన్నారు. ఆ తర్వాత సాయి బయటకు వెళ్లిపోయారు. అయితే కొన్ని రోజులుగా ఈ ఛానల్ లో పరిస్థితులు ఏమీ బాగోలేదని.. పై స్థాయి ఉద్యోగుల మధ్య సఖ్యత లేకపోగా గొడవలు ముదిరి పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లిందనీ వార్తలు వచ్చాయి.

 

 

ఇప్పుడు ఈ ఛానల్ ఛైర్మన్ మురళీకృష్ణంరాజు స్వయంగా చేసిన ప్రకటనతో అవన్నీ నిజమేనని తేలింది. తాను ఈ గొడవలతో పూర్తిగా విసిగిపోయానని లేఖలో చెప్పుకున్నారాయన. సంస్థలో సీనియర్ ఉద్యోగులు గొడవలు పడి.. పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లారని.. అది తనను బాధించిందని లేఖలో తెలిపారు. చాలా కాలంగా నుంచి జీతాలివ్వలేకపోతున్నట్లుగా.. మురళీకృష్ణంరాజే తన లేఖలో పేర్కొన్నారు. అంటే మరి ఇక ఈ చానల్ మూతపడుతుందా.. లేక ఎవరైనా నడిపిస్తారా అన్నది తేలాల్సి ఉంది.

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: