ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు చైనా దేశంలో మరణ మృదంగం మోగించి  ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న ఈ మహమ్మారి వైరస్.. ఇప్పుడు ప్రపంచ దేశాలకు కూడా శరవేగంగా వ్యాప్తిచెందుతూ ఉంది. అయితే ఇప్పుడిప్పుడే చైనా దేశంలో కాస్త తగ్గుముఖం పట్టిన... ప్రపంచ దేశాల్లో మాత్రం విజృంభిస్తుంది  ఈ మహమ్మారి. ఈ నేపథ్యంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా కరోనా వైరస్ ను ప్రపంచ మహమ్మారిగా గుర్తించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ కరోనా వైరస్ కు  సరైన విరుగుడు మందు లేదని నివారణ ఒక్కటే మార్గం అంటూ ప్రపంచ దేశాల ప్రజలకు సూచిస్తోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. 

 

 

 ఇక ప్రపంచ వ్యాప్తంగా గత రెండు నెలల నుంచి విరుగుడు కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు ఏ పరిశోధనలు సత్ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రోజురోజుకూ ప్రపంచ దేశాల ప్రజల్లో ప్రాణభయం పాతికుపోతుంది. అయితే వేడి ప్రదేశాల్లో కరోనా  వైరస్ బ్రతకదు  అని కొంతమంది వైద్యులు తెలిపారు. కేవలం చల్లటి ప్రదేశాలలో మాత్రమే కరోనా వైరస్ బతక కలదు అని తెలిపారు. ఈ నేపథ్యంలో వేసవికాలం వస్తున్న సమయంలో... వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కాలంలో  కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం లేదని పలువురు భావిస్తున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు కూడా దీనికి సంబంధించి సానుకూలంగానే స్పందిస్తున్నారు. 

 

 

 అయితే తాజాగా దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఎండాకాలంలో కరోనా  వైరస్ బతకదు అన్న మాట వాస్తవం కాదని  అంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది. తాజాగా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా కరోనా వైరస్ బతికే అవకాశాలు ఉన్నాయి అంటూ స్పష్టం చేసింది . ఏ కాలంలోనైనా కరోనా  వైరస్ నశించదు అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఎండాకాలంలో కరోనా  వైరస్ నశిస్తుంది అనడానికి వీలు లేదు అంటూ తెలిపింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ ఏ కాలంలో అయినా ఎక్కడ ఉన్నా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఎంతో మేలు అంటూ ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: