స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియలో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలను రద్దు చేయించటానికి ప్లాన్ జరుగుతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. స్ధానిక ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ  రాయటంతో అనుమానలు ఇంకా పెరిగిపోతున్నాయి. తనకు ప్రాణహాని ఉంది కాబట్టి తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని అడగాడంటే సరేలే ఏదో అని సరిపెట్టుకోవచ్చు.

 

కానీ అక్కడతో ఆగకుండా వాయిదా ముందు జరిగిన ఏకగ్రీవాల సందర్భంగా చాలా చోట్ల గొడవలు జరిగాయని ఫిర్యాదు చేయటమే ఆశ్చర్యంగా ఉంది. అలాగే మాచర్ల, పుంగనూరు, పీలేరు, గురజాల లాంటి నియోజకవర్గాల్లో అన్నీ ఎంపిటిసి స్ధానాలు ఏకగ్రీవం అవటం వెనుక అనుమానాలను లేవనెత్తారు. నామినేషన్లు వేసేందుకు వచ్చిన వాళ్ళని బెదిరించటం, వేసిన వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి బెదిరించటం వల్లే 24 శాతం ఎంపిటిసి స్ధానాలు ఏకగ్రీవమైనట్లు ఆరోపించాడు. అలాగే 124 జడ్పిటిసిలు ఏకగ్రీవం వెనుక కూడా బెదిరింపులే ఉన్నట్లు చెప్పారు.

 

ఎన్నికల నామినేషన్, ఉపసంహరణల స్వేచ్చగా జరగలేదని, కేవలం బెదిరింపుల వల్లే జరిగిందని ఫిర్యాదు చేయటం గమనార్హం. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు కూడా ఎవరి డ్యూటి వాళ్ళు చేయలేదని పోలీసు శాఖ కూడా అధికారపార్టీకే కొమ్ము కాసిందని చెప్పకనే చెప్పాడు నిమ్మగడ్డ. మొత్తం మీద జరిగిన ఎన్నికలంతా బెదిరింపులే అంటూ తన లేఖలో చెప్పటం అనుమానాలకు దారితీస్తోంది.

 

హోంశాఖ కార్యదర్వికి రాసిన ఐదు పేజీల లేఖలో అధికార పార్టీపై రమేష్ ఆరోపణలు చేయటమంటే మామూలు విషయం కాదు. పైగా ఏపిలో తనకు రక్షణ లేదు కాబట్టి తాను హైదరాబాద్ లో కూర్చుని విధులు నిర్వర్తిస్తానని చెప్పటమే హైలైట్. అంటే లేఖలో ఉన్నదేమిటంటే ఎన్నికలు సజావుగా జరగలేదని చెప్పటమే. పైగా ఇప్పటికే జరిగిన ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని చంద్రబాబునాయుడు, కన్నా లక్ష్మీనారాయణ, పవన్ కల్యాణ్, రామకృష్ణలు డిమాండ్ చేస్తున్నారు. అంటే అందరూ కూడబలుక్కుని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిపోతోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: