కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో గుర్తించబడిన ఈ ప్రాణాంతకమైన వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు శర వేగంగా వ్యాప్తి చెందుతూ అందరిలో ప్రాణాపాయాన్ని కలిగిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య రెండు లక్షలు దాటిపోయింది. బుధవారం రోజు నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య రెండు 2,00680 కి  ఈ వైరస్ బారిన పడిన తేలింది. ఇప్పటివరకు ఈ ప్రాణాంతకమైన మహమ్మారి బారిన పడి 8092 మంది మరణించారు. ఇక మరణాల సంఖ్య లో ఆసియాను యూరోప్ దాటేసింది. ఇప్పటివరకు ఆసియాలో 3384 మంది కరోనా వైరస్ బారినపడి చనిపోగా.. యూరప్లో 3422 మందిని ఈ మహమ్మారి పొట్టన పెట్టుకుంది. ఇక చైనా దక్షిణ కొరియా లో కరోనా వైరస్ కేసులు కొత్తగా నమోదైన వారి సంఖ్య చాలా తక్కువ అవుతుంది. చైనాలో బుధవారం కొత్తగా ఒకే కరోనా  పాజిటివ్ కేసు మాత్రమే నమోదవడం గమనార్హం. 

 

 అమెరికాలో కరోనా  వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 190కు చేరింది. మొత్తం అమెరికాలో 50 రాష్ట్రాలు ఈ వైరస్ బారినపడి ప్రాణ భయంతో విలవిలలాడుతోన్నాయి . మొత్తంగా 6522 పాజిటివ్ కేసులు అమెరికాలో నమోదయ్యాయి. మెడికేర్ టెలి హెల్త్  సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  తెలిపారు. కరోనా  పై పోరాటం లో గెలవాలి అంటూ సూచించారు. ప్రస్తుతం 80 లక్షల మంది పౌరులను ఇళ్లల్లోనే నిర్బందించాల్సిన పరిస్థితి నెలకొంది. 

 

 కరోనా  వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఉద్దేశంతో... సరిహద్దులను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు  యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాలకు చెందిన ప్రజలు 30 రోజులపాటు ఈ దేశాల్లో కి రాకుండా నిషేధం విధించింది. కాగా ఇప్పటివరకు యూరోప్లో 3422 మరణాలు చోటు చేసుకున్నాయి. ఇటలీలో కూడా 2978 మంది ఇప్పటి వరకూ కరోనా వైరస్ బారినపడి చనిపోయారు.

 

 మరోవైపు ఇరాన్ లో  కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. మంగళవారం ఒక్కరోజే 147 మంది ఈ వైరస్ బారిన పడినవారు మృత్యువాత పడ్డారు. ఇక ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 1135 కు చేరింది. ఇక మొత్తం కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య 17,161 చేరింది. ఇక బుధవారం ఒక్కరోజే 1192 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

 అయితే వైద్య సదుపాయాలు అతి తక్కువగా ఉండే ఆఫ్రికాలో ఇప్పటివరకూ 500 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇక బుర్కినాఫాసోలో తొలి కరోనా  మరణం కూడా చోటు చేసుకుంది. లాటిన్ అమెరికాలో 1100 కేసులు నమోదవగా బ్రెజిల్ లో  మంగళవారం తొలి మరణం నమోదైంది.

 

 ఇక ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 454 కరుణ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఇక అక్కడి ప్రభుత్వం హ్యూమన్ బయో సెక్యూరిటీ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ సందర్భంగా కఠిన నిబంధనలను కూడా అమలులోకి తెచ్చింది.

 

 ప్రపంచ దేశాల్లో కరోనా  వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం భారీగా పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ కరోనా  వైరస్ వ్యాప్తి కారణంగా వేగంగా 2.5 కోట్లమంది ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి కోల్పోయే ఉందని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: