జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తు తెలుగుదేశంపార్టీ, పచ్చమీడియా కొత్త కుట్రను మొదలుపెట్టినట్లుంది. స్ధానిక సంస్ధల ఎన్నికల వాయిదా నేపధ్యంలో ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రహోం శాఖ కార్యదర్శికి ఐదు పేజీల ఓ లేఖను రాశారంటూ ఓ వార్త  సంచలనమైంది.  ఎన్నికల వాయిదాపై సుప్రింకోర్టు తీర్పు చెప్పిన వెంటనే నిమ్మగడ్డ పేరుతో ఓ లేఖ సర్క్యులేట్ అవ్వటం కలకలం రేపింది. ఆ లేఖలో సారంసం ఎలాగున్నా నూరుశాతం  జగన్ ను టార్గెట్ చేసిందనే  చెప్పాలి. పైగా జగన్ కు వ్యక్తిగతంగానే కాకుండా ప్రభుత్వాన్ని కూడా చాలా డ్యామేజ్ చేసిందనే చెప్పాలి.

 

సరే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత తీరిగ్గా నిమ్మగడ్డ సదరు లేఖను తాను రాయలేదని ఏఎన్ఐ వార్తా సంస్ధకు చెప్పారు. ఇక్కడే అందరికీ అనేక అనుమానాలు పెరిగిపోతున్నాయి. అవేమిటంటే నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖకు వెళ్ళిన లేఖ నిమ్మగడ్డ రాయకపోతే మరెవరు రాశారు ? పైగా వెళ్ళిన లేఖ కూడా నిమ్మగడ్డ అధికారిక మెయిల్ నుండే వెళ్ళిందట.  తన అధికారిక  మెయిల్ నుండి కమీషనర్ కే తెలీకుండా ఏకంగా కేంద్ర హోంశాఖకే లేఖ వెళ్ళటం మామూలు విషయం కాదు.

 

రాష్ట్రంలో ఇంత  సంచలనమైన లేఖపై ఇపుడు నిమ్మగడ్డ ఏమి చేయబోతున్నారు ? పోలీసులకు ఫిర్యాదు చేస్తారా ? ఆయన పేరుతో వెళ్ళింది కాబట్టి నిమ్మగడ్డే పోలీసులకు కంప్లైంట్ చేయాలి. ఒకవేళ నిమ్మగడ్డ ఫిర్యాదు చేయకపోతే అపుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ? ఎందుకంటే లేఖలోని అంశాలు జగన్ కే డ్యామేజింగ్ గా ఉంది. కాబట్టి జగన్ ఉపేక్షిస్తే మొదటికే మోసం వస్తుంది. పైగా ఈ ఫేక లేఖకు పచ్చమీడియా విపరీతమైన ప్రచారం చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగితే  లేఖ ఎక్కడి నుండి వెళ్ళింది ? లేఖ వెనకాల ఎవరున్నారు ? అన్న  విషయాలు తెలిసిపోతుంది.

 

సరే  ఈ విషయాలను పక్కనపెట్టేస్తే లేఖ కుట్రలో తెలుగుదేశంపార్టీ హస్తమేంటి ? అనేది ఇపుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇటువంటి కుట్రలు  చేయటం చంద్రబాబునాయుడుకు కొత్తేమీ కాదు. ప్రత్యర్ధులను గబ్బు పట్టించటానికి, బురద చల్లటానికి చంద్రబాబు ఎటువంటి నీచానికైనా దిగజారుతారన్న విషయం అందరికీ తెలిసిందే.  ఏదేమైనా జగన్ పై కొత్తగా పచ్చకుట్ర మొదలైనట్లే ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: