ప్రపంచాన్ని భయ భ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు వందేళ్ల నాటి దారుణ ఘటన గుర్తుకు తెస్తుందని అంటున్నారు.  ప్రపంచంలో ఇప్పటి వరకు ఎన్నో వైరస్ లో బీభత్సాన్ని సృష్టించిన విషయం తెలిసిందే.  మనిషి ఎంత ఎదుగుతున్నాడో తన చుట్టూ పరిసర ప్రాంతాలను అంతే దారుణంగా నాశనం చేస్తున్నాడు. తాను తినే ఆహారపు అలవాట్లలో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు.. వెరసి వీటి వల్ల కొత్త కొత్త రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో కొత్త కొత్త వైరస్ లు పుట్టుకొస్తున్నాయి.  ఇప్పటి వరకు వచ్చిన వైరస్ ప్రభావాలు ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం మరో ఎత్తు అయ్యింది. అయితే కరోనా మహమ్మారి కన్నా దారుణమైన ఓ వైరస్ వందేళ్ల క్రితం స్పానిష్ ఫ్లూ అందరికీ గుర్తొస్తోంది.

 

1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ చేదు అనుభవాలు అందర్నీ కలవరపెడుతున్నాయి.  మన దేశంలో స్పానిష్ ఫ్లూ చాలా దారుణమైన ప్రభావం చూపించింది. ఏకంగా దేశంలో ఆరు శాతం జనాభాను బలితీసుకుంది. అప్పట్లో సౌతాఫ్రికా నుంచి వచ్చిన గాంధీజీకి కూడా ఫ్లూ సోకింది. అయితే అదృష్టవశాత్తు ఆయన ఫ్లూ నుంచి బయటపడ్డారు. బొంబాయికి సైనికుల్ని తీసుకొచ్చిన ఓ నౌక ద్వారా స్పానిష్ ఫ్లూ భారత్ కు వచ్చింది. ఇప్పుడు కూడా దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. భారత దేశంలో ఎక్కువాగా విదేశాల నుంచి వచ్చిన వారికే ఈ వైరస్ సోకడం విశేషం.

 

గతంలో ఫ్లూ లాగే.. ఇప్పుడు కరోనా మరణాలు కూడా పెరుగుతాయనే ఆందోళన ఉంది.  కాకపోతే అప్పట్లో ఇంత టెక్నాలజీ లేక పోవడం.. ఎక్కువ నిరక్షరాస్యత ఉండటంతో  ఫ్లూ భారిన పడి చాలా మంది చనిపోయారు.  కానీ ఇప్పుడు జనాల్లో చైతన్యం వచ్చింది.. సాధ్యమైంత వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. అంతే కాదు అత్యాధునికమైన వైద్య సదుపాయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అప్పటితే పోలిస్తే ఇప్పుడు దేశంలో అక్షరాస్యత, పరిశుభ్రత కూడా గణనీయంగా మెరుగయ్యాయి. ప్రభుత్వం కూడా మిగతా దేశాల కంటే వేగంగానే చర్యలు తీసుకుంటోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: