ప్రపంచ దేశాలను సైతం వణికిస్తున్న ఈ కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ వలన ఇప్పటికే చాల మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ వైరస్ ఇప్పుడు తెలంగాణలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. రాష్ట్రములో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒకేసారి తెలంగాణలో ఏడు కరోనా కేసులు నమోదవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది.

 

రాష్ట్రములో బుధవారం నాటికీ  కరోనా కేసులు ఆరు నమోదయ్యాయి. అయితే బుధవారం రాత్రి కరోనాపై వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా మరో ఏడు కొత్త కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.  దీంతో హైదరాబాద్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

 

కొత్తగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌గా తేలిన బాధితులెవరూ తెలంగాణ వారు కాదు. వారంతా ఇండోనేషియాకు చెందినవారే. ఇండోనేషియా నుంచి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు ఉండడంతో వారిని గాంధీకి తరలించారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారికి గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. 

 

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కరోనా కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై గురువారం సీఎం కేసీఆర్‌ అత్యవసర ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహిస్తున్నారు.

 

రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ చర్చించే అవకాశముంది. కరోనాపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. 

 

ప్రజలు స్వీయ ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. జనం గుమిగూడే కార్యక్రమాలు, వేడుకలు రద్దు చేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.రు. సామూహికంగా జరిగే పండుగలు, ఉత్సవాలకు దూరంగా వుండాలని కోరారు. కరోనాపై ప్రభుత్వం తీసుకునే చర్యలను ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: