కరోనా  వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్న విషయం తెలిసిందే. ప్రజలందరూ ప్రాణభయంతో చిగురుటాకులా వణికిపోతున్నాయి . కరోనా  వైరస్ కు  సరైన విరుగుడు కూడా లేకపోవడంతో... ప్రజల్లో  మరింత ప్రాణభయం రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే మొన్నటి వరకు చైనా దేశంలో మరణ మృదంగం మోగించిన ఈ ప్రాణాంతకమైన వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలలో శర  వేగంగా వ్యాప్తి చెందుతూ బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా అప్రమత్తమై పోయాయి. ఎక్కడికక్కడ నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు కరోనా  వైరస్ నియంత్రణకు కృషి చేస్తున్నాయి. 

 

 

 అయితే ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా  వైరస్ గురించి జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత... మళ్ళీ ఇన్నేళ్లకి  జర్మనీ కరోనా వైరస్ రూపంలో అతిపెద్ద సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఓ టీవీ షో కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు జర్మనీ దేశ పౌరులు అందరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి అంటూ ఈ సందర్భంగా ఆమె కోరారు. దేశ ప్రజలందరూ కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు ప్రజలందరూ తమ  బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే... ఈ మహమ్మారి వైరస్ ను విజయవంతంగా జయించవచ్చు అంటూ ఆమె సూచించారు. 

 

 

 

 ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలి అని సూచించారు. ఎవరు కరచాలనం చేసుకోకూడదు అంటూ సూచించినా ఏంజెలా మెర్కెల్... కేవలం కంటి చూపు సైగల ద్వారా మాత్రమే పలకరించుకోవాలి అంటూ సూచించారు. అయితే కరోనా  వైరస్ వ్యాప్తిని దేశ పౌరులందరికీ ఉండే ప్రయాణం హక్కును కాదని  చెప్పడం భావ్యం కాదు అంటూ తెలిపిన ఆమె... ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అన్నీ తమ దేశ పౌరులను  కాపాడుకోవడం కోసమే అంటూ పేర్కొన్నారు. ఈ కరోనా వైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పడకుండా ఉండేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము అంటూ తెలిపారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ భరోసా ఇచ్చారు. అయితే 15 ఏళ్లపాటు పదవిలో ఉన్న  ఏంజెలా మెర్కెల్.... జర్మనీలో ఏర్పడిన ఎన్నో సంక్షోభాలను విజయవంతంగా వ్యూహాత్మకంగా ఎదుర్కొన్నారు. అయితే ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ ఇప్పుడు వరకు ప్రజలకు ఎప్పుడూ నేరుగా సూచనలు ఇవ్వలేదు ఏంజెలా మెర్కెల్.

మరింత సమాచారం తెలుసుకోండి: