ప్రపంచవ్యాప్తంగా కరోనా అందరిని వణికిస్తున్న విషయం తెలిసిందే.. నిన్నటివరకు ఏపీలో కూడా ఒక కరోనా కేసు ఒకటే ఉండటంతో అంత జాగ్రత్తలు ఉండేవికావు. కానీ.. ఈరోజు మరో కొత్త కేసు నమోదయింది దీంతో ఏపీలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ రోజుకి మొత్తం కరోనా భాదితుల సంఖ్య 2కి చేరింది. కొత్తగా కొరోనా సోకినా యువకుడు లండన్ నుంచి వచ్చాడని అధికారులు తెలిపారు. ఈ యువకుడు ప్రకాశం జిల్లా వాసిగా ఆరోగ్య శాఖ  అధికారులు బులిటెన్ లో విడుదల చేశారు.

 

అయితే.. ఇప్పటికి కరోనాతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన వ్యక్తి నెల్లూరి జిల్లా వాసిగా డాక్టర్లు పేర్కొన్నారు. కాగా., లండన్ నుంచి వచ్చిన యువకుడు నాలుగు రోజుల కిందట కరోనా లక్షణాలతో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. అతనికి వైరస్ నిర్దారణ పరీక్షచేయటానికి బ్లడ్ సాంపిల్స్ ను సేకరించి పూణే పంపారు. అతని రిజల్ట్ ఈరోజు రాగ అతనికి కరోనా ఉన్నట్లు వైద్యాధికారులు తేల్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 109 మంది శాంపిల్స్ ను అనుమానితులుగా సేకరించారు.

 

అయితే.. వారిలో 94 మందికి నెగిటివ్‌ వచ్చినట్లు మిగతా వారి రిపోర్టులు రావలసింది తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటుంది. విదేశాల నుంచి వచ్చేవారికి ఎయిర్‌పోర్టులోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారికి కరోనా లక్షణాలు ఉన్నా లేకపోయినా కూడా ప్రభుత్వం వారందరికీ నోటీసులు ఇస్తుంది.ఈ నోటీసులను అతిక్రమిస్తే ఆంధ్రప్రదేశ్ ఎపిడెమిక్ డిసీజ్ కోవిద్-19 2020, ఐపీసీ 188 ప్రకారం చట్టరీత్యా చర్య తీసుకుంటామని హెచ్చరించారు.

 

కాగా., ఇప్పటికి రాష్ట్రంలో హెల్ప్ లైన్ నెంబర్ 104ను అందుబాటులో ఉంచారు. ఈ నెంబర్ ను కాల్ చేసి ఎలాంటి ఆరోగ్య సంబంధ విషయాలనైనా, సలహాలనైనా పొందవచ్చని తెలిపింది. ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను కోవిడ్-19 నియంత్రణ, పర్యవేక్షణ చర్యలపై జిల్లా నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, కోచింగ్‌ సెంటర్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే పరీక్షలలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: