తెలంగాణ రాజ‌కీయాల్లో మాజీ ఎంపీ క‌విత శకం మొద‌లైందా..? ఇక నుంచి ఆమె క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారా..?  ఇందూరు రాజ‌కీయం కీల‌క మ‌లుపుతిరుగ‌బోతోందా..?  క‌మ‌ల‌ద‌ళానికి ప‌గ‌టి చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయ‌మేనా..? అంటే గులాబీశ్రేణులు మాత్రం ఔన‌నే అంటున్నాయి.  రాజ‌కీయాల్లోకి ఆమె పున‌రాగ‌మనంతో గులాబీ శ్రేణుల్లో ఫుల్‌జోష్ క‌నిపిస్తోంది. నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా ఆమె నామినేష‌న్ దాఖ‌లు చేయ‌డంతో ఇందూరు రాజ‌కీయం కొత్త‌పుంత‌లు తొక్క‌డం ఖామ‌య‌ని టీఆర్ఎస్ నాయ‌కులు అంటున్నారు. ఈ ఎన్నిక‌ల్లో ప‌లువురు పోటీలో ఉన్నా.. క‌విత గెలుపు లాంఛ‌న‌మే కానుంది. ఎందుకంటే.. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లు, మున్సిపల్‌ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు మొత్తం 824 ఉండగా, ఇందులో 550 పైగా టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులే ఉన్నారు. దీంతో క‌విత‌ విజయం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక త‌ర్వాత టీఆర్ఎస్ పార్టీలో, ప్ర‌భుత్వంలో కీల‌క మార్పులు చోటుచేసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని చెప్పొచ్చు. 

 

నిజానికి.. సీఎం కేసీఆర్ కూతురుగా, తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షురాలిగా క‌విత తెలంగాణలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఎలాంటి అంశంపైనైనా మంచి వాగ్దాటితో ప్ర‌త్యర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తారు. జాగృతి అధ్య‌క్షురాలిగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప‌ర్య‌టించారు. ఈనేప‌థ్యంలో కేసీఆర్ త‌ర్వాత అంత‌టి ప్ర‌భావిత నాయ‌కురాలిగా ఆమె అన‌తికాలంలోనే ఎదిగారు. ఇక నిజామాబాద్ ఎంపీగా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యారు. అయితే.. 2019 ఎన్నిక‌ల్లో ఆమె అనూహ్యంగా ఓట‌మి చెందారు. ఇక అప్ప‌టి నుంచి రాజ‌కీయాల‌కు దూరంగానే ఉంటున్నారు. దీంతో మ‌ళ్లీ క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి రావాల‌ని పార్టీ శ్రేణులు, అభిమానులు కోరుతున్నారు. ఈ నేప‌థ్యంలో నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగ‌డంతో పార్టీ శ్రేణులు ఆంద‌నం వ్య‌క్తం చేస్తున్నాయి. 

 

అయితే.. క‌విత‌కు సీఎం కేసీర్ ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌విని అప్ప‌గించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు నాయ‌కులు చెబుతున్నారు. ఒక‌వేళ ఆమెకు కీల‌క ప‌ద‌వి ద‌క్కితే.. ఇక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ త‌ర్వాత పార్టీలో, ప్ర‌భుత్వంలో క‌విత పాత్ర పోషిస్తార‌ని చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో నిజామాబాద్‌లో రోజురోజుకూ కొంత బ‌లం పుంజుకుంటున్న‌ బీజేపీకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించే స‌మ‌యంలో ఆస‌న్న‌మైంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇందూరు రాజ‌కీయం మ‌రింత‌గా వెడెక్క‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఇక క‌వితను ఎదుర్కొంనేందుకు బీజేపీ ఎంపీ అర్వింద్ ఎలాంటి వ్యూహాలు ర‌చిస్తారో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: