ప్రస్తుతం ప్రాణాంతకమైన మహమ్మారి కరోనా  వైరస్ భారత ప్రజలందరినీ బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలలో విస్తరిస్తూ... అందరినీ ప్రాణభయంతో వణికిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతకమైన వైరస్ భారత్ లో అడుగు పెట్టి 150 మందికి సోకిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఎన్నో కఠిన నిబంధనలు అమలులోకి తెస్తోంది. ఇక ఈ ప్రాణాంతకమైన మహమ్మారి వైరస్ కు ఎలాంటి విరుగుడు లేకపోవడంతో... నివారణ ఒక్కటే మార్గం కావడంతో ప్రజల్లో  మరింత ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ధైర్యం కలిగిస్తూ మరింత అవగాహన చర్యలు చేపట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మర చర్యలు చేపడుతున్నాయి. 

 

 

 ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలలో విస్తరించి శర వేగంగా వ్యాప్తి చెందుతుంది ఈ మహమ్మారి వైరస్. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా బూచి అడుగు పెట్టిన  విషయం తెలిసిందే. ఇక తెలంగాణ రాష్ట్రంలోకి కరోనా వైరస్ ప్రవేశించడంతో కేసీఆర్ సర్కార్ అప్రమత్తమై తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా షట్ డౌన్  చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలతోపాటు షాపింగ్ మాల్స్ పబ్బులు ఇలా జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలు అన్నీ.. మూతపడ్డాయి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ కీలక చర్యలు తీసుకుంటుంది కేసీఆర్ సర్కార్. 

 

 

 ఈ నేపథ్యంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు వచ్చిన 11 మంది మత ప్రచారకుల్లో  ఏడుగురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. అయితే మత ప్రచారకులు ఈ నెల 14న ఢిల్లీ నుంచి కరీంనగర్ రామగుండం కు క్రాంతి సంపర్క్ ఎక్స్ ప్రెస్ లో  వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సంపర్క్ ఎక్స్ ప్రెస్ లో వచ్చిన బోగీలో ఉన్న వారందరూ పరీక్షలు చేసుకోవాలి సూచించారు అధికారులు. ఇక నగరంలో 144 సెక్షన్ విధించారు అధికారులు.. 100 ప్రత్యేక బృందాలతో ప్రతి ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: