హైదరాబాద్ లో ని ఖైరతాబాద్ లో గుట్టుగా సాగుతున్న సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. పంజాగుట్ట పరిధిలోని రాజ్ నగర్ లో ఓ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో ఈ ఫ్లాట్ పై దాడి చేసిన పోలీసులు అందులో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేశారు.

 

 

 ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఈ వ్యభిచార రాకెట్ ను గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్నారని పోలీసుల విచారణ తేలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పవన్ మరియు కిరణ్ అనే ఇద్దరు ఆర్టిస్టులు ఈ రాకెట్ ను నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. జూనియర్ ఆర్టిస్టులుగా వస్తున్న ఆదాయం సరిపోక.. అవసరాలకు , విలాసాల కోసం ఇలాంటి వ్యవహారాలకు తెరతీస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

 

 

 కృష్ణానగర్ లో జూనియర్ ఆర్టిస్టులుగా సినిమాల్లో ప్రయత్నిస్తున్న వీరిద్దరూ విలాసాలకు అలవాటు పడ్డారని. డబ్బులు ఎక్కువగా సంపాదించాలని భావించిన వీరు గుట్టుగా ఈ ఫ్లాట్ ను అద్దెకు తీసుకున్నారని పోలీసులు తెలిపారు.  వీరి ఫ్లాట్ కి మహిళలు ఎక్కువగా వస్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు దాడి చేశామని పోలీసులు వెల్లడించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిలో పవన్ ను అదుపులోకి తీసుకున్నామని.. పారిపోయిన కిరణ్ కోసం గాలింపు జరుపుతున్నామని వారు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడి వ్యభిచారం కోసం తీసుకొచ్చిన మహిళలను కూడా అదుపులోకి తీసుకున్నామని వారు పేర్కొన్నారు.

 

 

కాగా ఇటీవల విశాఖలో కూడా ఇలాంటి వ్యభిచార గృహంలో ఓ జబర్దస్త్ కామెడీ షోలో కన్పించే జూనియర్ ఆర్టిస్టులైన దొరబాబు. పరదేశీలు పోలీసులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. వీరిలాగే చాలా మంది డబ్బులు, విలాసాల కోసం ఇలాంటి వక్రమార్గాలు ఎన్నుకుంటున్నారు. వీరేకాక పలువురు మహిళా జూనియర్ ఆర్టిస్టులు కూడా గతంలో ఇలాంటి సెక్స్ రాకెట్లలో దొరికన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: