దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నో కఠిన నిబంధనలు అమలులోకి తెస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇక కరోనా  వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమై ఎన్నో కఠిన నిబంధనలను అమలు చేస్తోన్నాయి. ఇప్పటివరకు ఏకంగా 167 కరోనా కేసులు భారతదేశంలో నమోదయ్యాయి. దీంతో రోజురోజుకు ప్రజల్లో ప్రాణభయం పెరిగిపోతుంది. కరోనా కు  సరైన వ్యాక్సిన్ కూడా ఇప్పటివరకు వాడుక లోకి రాక పోవడంతో ఈ ప్రాణాంతకమైన వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజల్లో మరింత ప్రాణభయం పాతుకుపోతుంది.  

 

 

 ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు సహా అన్ని ప్రదేశాలను మూసి వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇక కరోనా విజృంభణ  నేపథ్యంలో పూర్తిగా భారత్ షట్ డౌన్  దిశగా అడుగులు వేస్తోంది. అయితే భారత దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత దేశంలోని ఎన్నో ప్రముఖ ఆలయాలు కూడా మూసివేసిన విషయం తెలిసిందే. ఇక కరోనా  సోకిన భక్తులెవరు ఆలయాలకు రావద్దంటూ ఆలయ నిర్వాహకులు కూడా చెబుతున్నారు. ఇప్పటికే దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయమైన కేరళలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా ఇలాంటి ప్రకటన విడుదల చేశారు. 

 

 

 ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు కరోనా విజృంభణ పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నాస్తికుడిని దేవుని నమ్మను అంటూ తెలిపిన నాగబాబు ఈ సందర్భంగా విమర్శలు చేశారు. మా దేవుడు గొప్ప.. మా దేవుడు గొప్ప అని ఇంకా కొట్టుకొని చావకండి... దేవుళ్ళు స్వామీజీలు దేవుడి ప్రతినిధులు ఏమి చేయలేక.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ గుళ్ళు ప్రార్థన మందిరాలు ఇంకా అన్నీ మూసుకుని కూర్చొని.. శాస్త్ర వేత్తలు డాక్టర్లు ఏ మందు కనిపెట్టి మనల్ని  కాపాడుతారా  అని ఎదురు చూస్తున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేశారు నాగబాబు. దేవుళ్ళకు మొక్కడం మానేసి సైంటిస్టులకు వెల్లి మొక్కదాం.. ఎందుకంటే కరోనా బారి నుంచి అందరిని కాపాడేది వాళ్లే అంటూ నాగబాబు వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: