కరోనా వైరస్ ప్రభావంతో భారత్ కు వచ్చే, పలు దేశాలలో కూడా విమానాలను రద్దు చేశారు ఆ విషయం తెలిసిందే. అయితే.. అక్కడి దేశాలలో చిక్కుకున్న తెలుగు వారిని రాష్ట్ర ప్రభుత్వం సైతం రప్పించిన విషయాలు లేకపోలేదు. అయినా కూడా కొన్ని కొన్ని దేశాలలో తెలుగు వారు అక్కడే స్ట్రక్ అయిపోయారు. విమానాలను రద్దు చేయటంతో స్వదేశానికి ఎలా తిరిగి రావాలో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది.

 

అయితే.. ఇప్పుడు భారత్‌ కు వచ్చే విమానాలను రద్దు చేయడంతో సింగపూర్‌లోని విమానాశ్రయంలో దాదాపు 80 మంది తెలుగువారు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వీరు మనీలాలో ఏపీ, తెలంగాణకు చెందిన 80 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. మొదట వీరిని కౌలాలంపూర్‌ మీదుగా విశాఖపట్నం వచ్చేందుకు ఎయిర్‌ ఏసియా విమానంలో ముందస్తుగానే టికెట్లు బుక్‌ చేసుకున్నారు. కానీ, భారత్‌ కు వచ్చే విమాన సర్వీసులను ప్రభుత్వం రద్దు చేయటంతో వారు స్వదేశానికి తిరిగొచ్చే మార్గం కనిపించలేదు.

 


ఎయిర్‌ పోర్టులో సుమారు 40 గంటలుగా విద్యార్థులు ఆహారం లేక అవస్థలు పడుతున్నారు. కొంత మంది నేలపైనే పడుకుంటుండడంతో ఎయిర్ పోర్టు సిబ్బంది విమానాశ్రయం నుంచి బయటకు పంపివేయటంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. చిక్కుకున్న వారిలో 80 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. దాదాపు 35 మంది తెలంగాణలోని హైదరాబాద్‌, వరంగల్‌ వాసులు సహా మిగతావారు ఏపీలోని ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, గుంటూరు, అనంతపురానికి చెందిన వారు ఉన్నారని తెలిపారు.

 

భారత్‌ కు నేరుగా విమాన సర్వీసులు రద్దు కావడంతో మూడు రోజులకి మూడు దేశాలు తిప్పారని మేము ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నామని ఆవేదన చెందారు. తమతో ఉన్న మరికొంత మందిని భారత ప్రభుత్వం ప్రత్యేక విమానంలో తీసుకెళ్లిందని, తమను కూడా అలాగే తీసుకెళ్లాలని వారు కోరుతున్నారు. మలేసియాలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. దీంతో అక్కడ నుంచి 185 విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం వారిని స్వదేశానికి చేర్చింది.  

 


  

మరింత సమాచారం తెలుసుకోండి: