చైనాలో మొదలైన కరోనావైరస్ ప్రపంచ దేశాలను గ‌జ‌గ‌జ‌లాడిస్తుంది. రోజురోజుకూ ఈ కేసులు పెరుగుతున్నాయి కానీ, త‌ర‌గ‌డం లేదు. ప్రపంచానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ నుంచి మానవాళిని రక్షించడానికి శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. వైరస్‌ను కట్టడిచేసే వ్యాక్సిన్‌ను తయారుచేయడంలో పరిశోధకులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, కెనడా, హాంకాంగ్, మలేషియా, నేపాల్, సింగపూర్, , తైవాన్, దక్షిణ కొరియా, థాయ్ లాండ్, వియత్నాం దేశాల్లో వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తుంది. 

 

మ‌రోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం సృస్టిస్తోంది.  ఇప్ప‌టికే తెలంగాణలో 13 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెండు కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గురివుతున్నారు. ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికే జంకుతున్నారు. ఇక రోజురోజుకి విస్తరిస్తున్న కరోనా నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ కచ్చితమైన జాగ్రత్తలు పాటించాల్సిందే. అందుకు ముందుగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు డబ్ల్యూహెచ్‌ఓ సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

 

ముఖ్యంగా సామాజిక దూరం పాటించడం ద్వారా ఈ మహమ్మారిని పారద్రోలవచ్చని నిపుణులు అంటున్నారు. సామాజిక దూరం పాటించడం అంటే సమూహాల్లో కలవకపోవడం. దీంతో క‌రోనాకు ఈజీగా చెక్ పెట్ట‌వ‌చ్చు. అదేలా అంటే.. కరోనా బారిన పడిన వ్యక్తి ద్వారా ఐదురోజుల్లో 2.5 మంది వ్యక్తులు డెడ్లీ వైరస్‌కు గురవుతుంటే వీరి ద్వారా నెలరోజుల్లో 406 మంది ఇన్‌ఫెక్షన్‌కు గురువుతున్నారు. 50 శాతం సామాజిక దూరాన్ని పాటిస్తే ఐదు రోజుల్లో బాధిత వ్యక్తి నుంచి వైరస్‌ సోకే వారి సంఖ్య 1.25 మందికి సోకుతుంది.

 

దీంతో నెలరోజుల్లో వీరి ద్వారా ఇన్‌ఫెక్షన్‌ సంక్రమించే వారి సంఖ్య 15 మందికి తగ్గుతుంది. ఇక 75 శాతం సామాజిక దూరం పాటిస్తే వైరస్‌ సోకిన వ్యక్తి ద్వారా ఐదు రోజుల్లో ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకే వారి సంఖ్య 0.625 మందికి కాగా, నెలరోజుల్లో వారి ద్వారా వైరస్‌ సోకే వారి సంఖ్య కేవలం 2.5 మందికే ప‌డిపోతుంది. కాబ‌ట్టి బీకేర్‌ఫుల్‌..!!
 

మరింత సమాచారం తెలుసుకోండి: