తెలంగాణ రాష్ట్రంలో కరోనా  వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారతదేశంలోని పలు రాష్ట్రాలను వణికిస్తున్న కరోనా వైరస్... తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రాణభయంతో బెంబేలెత్తిస్తున్నది . అయితే భారత దేశ వ్యాప్తంగా ఏకంగా 167 కరుణ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కేవలం తెలంగాణ రాష్ట్రంలో 13 కరోనా  పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. అయితే రోజురోజుకు తెలంగాణలో కరోనా  వ్యాప్తి పెరిగిపోతుండడంతో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై ఎన్నో కఠిన నిబంధనలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక కరోనా  వైరస్  కు సరైన వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం ప్రజలందరూ ప్రాణభయంతో వణికిపోతున్నారు. 

 

 అయితే కరోనా వైరస్ తొలి పాజిటివ్ కేసు తెరమీదకి  వచ్చినప్పటినుంచి రాష్ట్ర ప్రజల్లో భయం మొదలైంది. అయితే రోజురోజుకు కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడంతో.. తెలంగాణ శాఖ రాష్ట్ర విభజన దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో వెలుగు చూసిన కరోనా కేసులన్నీ సెకండ్ కాంటాక్ట్ కి సంబంధించినవి కావడం గమనార్హం. ఇప్పటికే దేశంలో కరోనా  వైరస్ రెండవ దశ విస్తరణలో ఉంది. నియంత్రణ గడువు కూడా రోజురోజుకు దగ్గర పడుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న వైరస్ నియంత్రణకు స్కూళ్లు,కాలేజీలు,సినిమా హాల్,  పబ్బులు, క్లబ్బులు,  కోచింగ్ సెంటర్లు తదితర సంస్థలు కూడా ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేయాలంటూ  ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడా జన సంచారం ఎక్కువగా ఉండే సంస్థలు తెరుచుకోవడం లేదు. 

 

 ఇలా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా రోజురోజుకు కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 13 కరోనా  పాజిటివ్ కేసులు నమోదు కాగా వీరిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. ఇక కరోనా సోకినా 13 మందిలో ఒకరు  చికిత్స ద్వారా కరోనా  నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు 7545 మందికి పైగా ప్రయాణికులకు స్క్రినింగ్ నిర్వహించారు అధికారులు. అయితే వీరిలో కరోనా  లక్షణాలు ఉన్న 447 మందిని గాంధీ ఆస్పత్రికి పంపించగా 13 మందికి కరోనా  పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇక ఎప్పుడూ జన సందోహంతో కళకళలాడే హైదరాబాద్లోని ప్రముఖ ప్రాంతాలు అన్నీ జనాలు లేక వెలవెల బోతున్నాయి . హైదరాబాద్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి చూస్తుంటే.. పూర్తిగా నిర్మానుష్యంగా నే కనిపిస్తోంది. నగరం మొత్తం కరోనాతో  చిగురుటాకులా వణికిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: