భారత దేశ వ్యాప్తంగా కరోనా  వైరస్ విజృంభిస్తే ఎంతోమందిని ప్రాణభయంతో వణికిస్తు విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాణాంతకమైన వైరస్ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ప్రాణ భయంతో వణికిపోతూన్నారు . రోజురోజుకు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడంతో ప్రజల్లో మరింత భయం  పెరిగిపోతోంది. దానికి తోడు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు... ప్రజలను మరింత అయోమయంలో పడేస్తున్నాయి. అయితే గతంలో కరోనా  వైరస్ తగ్గడానికి పారాసెట్మాల్ వేసుకుంటే సరిపోతుందని.. ఎక్కువ భయపడాల్సిన పని ఏమీ లేదు అంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

 

 

 అయితే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి దేశవ్యాప్తంగా అందరిని  ప్రాణభయంతో వణికిస్తున్న కరోనా వైరస్ పై అవగాహన లేకుండా... కేవలం ఒక పారాసెట్మాల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అంటూ చెప్పడంపై సోషల్ మీడియా వేదికగా ఎన్నో విమర్శలతో పాటు.. ట్రోల్స్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేవలం... ముఖ్యమంత్రిలు  మాత్రమే కాదని శాస్త్రవేత్తలు కూడా అంటూ ఎంతో మంది సెటైర్లు వేశారు. కేవలం పారసీట్మాల్  వేసుకుంటే తగ్గిపోతుంది అని తెలియక దేశంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు అంటూ కామెంట్ చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యలు... సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీశాయి. 

 

 

 ఇక తాజాగా మరో ప్రముఖ వ్యక్తి కరోనా  వైరస్ నియంత్రణకు ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అదనపు ప్రధాన కార్యదర్శి... పీవీ రమేష్ కరోనా  వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కారం, మిరియాలు ఎక్కువగా తీసుకుంటే కరోనా  వైరస్ సోకే ప్రమాదముందని.. ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కరోనా ను నియంత్రించేందుకు ప్రతి ఆరు గంటలకు ఒకసారి పారాసెట్మాల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది ఆయన తెలిపారు. దీంతో ప్రస్తుతం సీఎం జగన్ అదనపు కార్యదర్శి పీవీ రమేష్ చేసిన వ్యాఖ్యలపై కూడా ట్రోల్స్  మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: