నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో సంవత్సరం క్రితం సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఆత్మహత్యపై ఇప్పటికీ చాలా అనుమానాలు అలాగే ఉన్నాయి. వాటన్నింటిని ఊహాగానాలు అని అనలేకపోయినా పోలీసు వారు ప్రతి ఒక్క కోణంలో ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు.

 

ఖైరతాబాద్ లోని ఆర్య వైశ్య భవన్ లో ఒక గది అద్దెకి తీసుకుని మారుతీరావు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలం నుండి విషం బాటిల్ మరియు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే మారుతీరావు రాసినట్లు భావిస్తున్న సూసైడ్ లెటర్ లో "గిరిజ (మారుతీ రావు భార్య) నన్ను క్షమించు తల్లి అమృత అమ్మ దగ్గరికి వెళ్లి పో" అని రాసి ఉంది. తర్వాత అమృతను తండ్రి మరణం గురించి తెలుసా అని అడగగా ఆమె తాను కూడా టీవీలో చూసి తెలుసుకున్నట్లు పేర్కొంది.

 

తర్వాత ఆమె మారుతీరావు అంతక్రియలు వద్దకు వెళ్ళినా అమృతను ఆమె బంధువులు శవం దగ్గరికి కూడా రానివ్వలేదు. దీంతో తండ్రిని చివరిసారి కూడా చూడకుండానే అమృత వెనుదిరిగి వెళ్లిపోయారు. తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించిన అమృత తన తల్లి వద్దకు వెళ్ళనని ఆమె తల్లి తన వద్దకు వచ్చి ఉంటే బాగా చూసుకుంటాను అని చెప్పింది.

 

అయితే తాజాగా ఇప్పుడు అనూహ్యంగా మరో ఘటన జరిగింది. ప్రణయ్‌ భార్య అమృత శనివారం సాయంత్రం తన తల్లి గిరిజను కలిశారు.తండ్రి మరణం అనంతరం తొలిసారి తల్లి గిరిజను చూసేందుకు పోలీసుల రక్షణ నడుమ అమృత తన నివాసానికి వచ్చి తల్లిని పరామర్శించింది. తండ్రి చివరి మాటను దృష్టిలో ఉంచుకుని అమృత గిరిజను కలిసినట్లు భావిస్తున్నారు. గత ఏడాది ప్రణయ్‌ను వివాహమాడిన తరువాత తల్లిని కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: