కరోనా భూతం ప్రజల్ని పీడుస్తోంది. ఏ సమయం ఎలా మారిపోతుంది అని భయపడేలా చేస్తోంది . ఈ కరోనా ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణిస్తూ ముప్పు తిప్పలు పెడుతోంది. వైరస్ వల్ల ప్రపంచమంతా దిగ్భందనం చోటు చేసుకుంటోంది. అయితే తాజాగా ఐరోపా ఒక నిర్ణయానికి వచ్చింది. మరో దేశం ప్రజలు రాకుండా ఉండడానికి సరిహద్దుల్ని మూసి వెయ్యడమే మంచిది అంటూ  ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 

ఇటువంటి నిర్ణయాలు ఇప్పటికే పలు దేశాలు వారు తీసుకున్నది కూడా తెలిసినదే. అయితే యూరప్ వారు రాకుండా ఉండడానికి ఆఫ్రికా నిషేధం విధించాయి. అంతే కాకుండా తాత్కాలికంగా విమాన సర్వీసులని కూడా నిలిపి వేయడం జరిగింది. ఇప్పటికే అనేక చోట్ల విద్యా సంస్థలకి సెలవలు ఇచ్చేసారు.

 

ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణిస్తూ ముప్పు తిప్పలు పెడుతోంది. అంతే కాకుండా మాల్స్, సినిమా థియేటర్లు, మార్కెట్లు వగైరా బంద్ చేసారు. పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమంటూ అనుమతి ఇచ్చేసాయి. 

 

అలానే ఇవన్నీ కచ్చితంగా పాటించాలంటూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైరస్ వల్ల ప్రపంచమంతా దిగ్భందనం చోటు చేసుకుంటోంది. అయితే వీటిని తప్పక పాటించాలంటూ నిషేదాజ్ఞలను అమలు చెయ్యడానికి ఫ్రాన్స్ లో లక్ష మంది పోలీసులని బరిలోకి దింపారు. అలానే మన భారత్ లో విద్యా సంస్థల్ని, సినిమా ధియేటర్లని కూడా మూసివేయడం జరిగింది. అలానే పెళ్ళిళకి, వినోద కార్యక్రమాలకి వెళ్ళ రాదంటూ హెచ్చరించారు.

 

 

అనేక కార్యక్రమాలపై ఆంక్షలని విధించారు. కరోనా వైరస్ అనుమానితులు  ఆస్పత్రికి వెళ్ళి వైద్యం తీసుకోవాలని ఆదేశించారు. ఈ పద్ధతులని కొన్ని నెలల పాటు పాటించడం ఎంతో ముఖ్యం అని  భావిస్తున్నారు.  2021 లో వ్యాక్సిన్ రావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు, కాబట్టి అప్పటి వరకు వీటిని పాటిస్తూ సురక్షితంగా ఉండడమే మంచిది అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: