అవిభక్త కవలలు అనగా గర్భంలో శరీరభాగాలు కలసిపోయి జన్మించిన ఏకరూప కవలలు. ఈ అరుదైన జన్మము సుమారు 49,000 నుండి 1,89,000 మందిలో ఒకరికి సంభవించే అవకాశం ఉన్నది.  సుమారు జన్మించిన వారిలో సగం మంది జివించి ఉండి జంటలుగానే ఉండి తమ జీవితాలను కొనసాగిస్తుంటారు. ఈ పరిస్థితి ఆడపిల్లలకు తరచుగా వచ్చే అవకాశం ఉంది. ఈ సంఘటనలు జరిగే నిష్పత్తి బాలికలలు 3:1 లో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అవిభక్త కవలలు వీణా-వాణీల గురించి తెలియని వారు ఉండరు.  వీరికి శస్త్ర చికిత్స ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. దీంతో తమ అవిభక్త పిల్లలను చికిత్స ద్వారా వేరుచేసి స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తారని అనుకున్న వీణావాణీల తల్లిదండ్రుల బాధ అలాగే ఉండిపోతోంది.

 

గతంలో ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా వీణా వాణీలను వేరుచేస్తామని చెప్పినప్పటికీ సక్సెస్ రేటు తక్కువగా ఉందని వారు వెనుకడుగు వేశారు. ఆ తర్వాత లండన్ నుంచి వచ్చిన వైద్యులు కూడా మొదట సానుకూలత వ్యక్తం చేసి.. ఆ తర్వాత వారు కూడా విరమించుకున్నారు. కాగా, వీణావాణీల వయస్సు పెరుగుతున్న కారణంగా వారిని విడదీసే అవకాశాలు తగ్గుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా అవిభక్త కవలలు వీణావాణీ ఇవాళ తెలంగాణ టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యారు. వీరికి హైదరాబాదులోని మధురానగర్ ప్రతిభా హైస్కూల్ లో సెంటర్ కేటాయించారు.

 

 వీణావాణీలను యూసుఫ్ గూడ స్టేట్ హోం నుంచి ప్రత్యేక వాహనంలో పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చారు.ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాస్తున్న వీణావాణీలకు వేర్వేరుగా హాల్ టికెట్లు ఇచ్చారు. అంతేకాదు, వీరిద్దరి సౌలభ్యం కోసం అదనంగా అరగంట సమయం కేటాయించారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఉండటంతో వీరిద్దరికీ వేరు వేరు మాస్క్ లు ఇచ్చారు. ఈ అవిభక్త కవలలకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శుభాకాంక్షలు తెలియజేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: