2012 సంవత్సరం డిసెంబర్ 16న దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఆరుగురు ఇనుపకడ్డీతో కొట్టి నిర్భయపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. 16 సాయంత్రం స్నేహితుడితో కలిసి సినిమా చూసి నిర్భయ బస్సు ఎక్కింది. మద్యం తాగి ఉన్న యువకులు కూడా అదే బస్సు ఎక్కారు. ఇనుప కడ్డీతో ఆమె స్నేహితునిపై, ఆమెపై దాడి చేసిన యువకులు కదులుతున్న బస్సులో గంటకు పైగా అత్యాచారం చేశారు.
 
అనంతరం ఆమెను, ఆమె స్నేహితుడిని యువకులు బస్సులోనుండి తోసేశారు. స్థానికులు అచేతనంగా, వివస్త్రగా పడి ఉన్న నిర్భయను చూసి సప్జర్ జంగ్ ఆస్పత్రిలో చేర్పించారు. నిర్భయ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆస్పత్రిలో చికిత్స అందించినా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో మెరుగైన చికిత్స కోసం సింగపూర్ లోని ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ ఆమె చికిత్స పొందుతూ డిసెంబర్ 29వ తేదీన మరణించారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజల నుండి నిరసన వ్యక్తమైంది. పోలీసులు డిసెంబర్ 21నాటికి బస్సు డ్రైవర్ తో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిర్భయ వైద్య విద్యార్థిని. ఆమె తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్ లోని బాల్దియా జిల్లాకు చెందినవారు. భద్రత కారణాల వల్ల ఆమెను నిర్భయ అని పిలుస్తున్నారు. 
 
నిర్భయ చిన్నతనం నుండి ఢిల్లీలోనే పెరిగారు. ఈ సంఘటనతో సంబంధం ఉన్న డ్రైవర్ రామ్ సింగ్ అతని తమ్ముడు ముఖేష్ సింగ్ ను పోలీసులు రాజస్థాన్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దోషులలో ఒక మైనర్ బాలుడు ఉండగా అతడు మూడేళ్ల జైలు శిక్ష అనంతరం విడుదలయ్యాడు. మిగిలిన నలుగురు నిందితులకు రేపు ఉదయం 5.30 గంటలకు కోర్టు డెత్ వారంట్ ప్రకారం ఉరి తీయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: