క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19 ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేస్తుంది.  ఇప్పటికే ఈ మహమ్మారి బారినపడి మూడు వేలమందికి పైగా మరణించారు. లక్షమంది వరకు దీని ప్రభావంతో ఆస్పత్రిపాలయ్యారు. రోజురోజుకూ కంగారు పెట్టేస్తున్న కరోనా.. సామాన్యులకు సైతం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మ‌రియు భార‌త్‌లోనూ క‌రోనా క్ర‌మంగా విజృభిస్తుంది. ఇక కరోనా వైరస్‌కి మందు లేదు. నివారణ ఒక్కటే మార్గం. 

 

అందువల్ల మనం అందరం... మౌత్ మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లను వాడుతున్నాం. వాస్త‌వానికి మాస్క్‌లు, శానిటైజర్ వంటి వాటిని మనదేశంలో ఉపయోగించడం చాలా అరుదు. కానీ ఈ కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పుడు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీనికి ముఖ్య కారణం. కరోనాను ఎదుర్కోవాలంటే.. ఎప్పుడూ శుభ్రతను పాటించాల్సిందే. ఇక  వ్యాపారుల బ్లాక్‌ మార్కెట్‌ పుణ్యమా అని ఎక్కడ కూడా హ్యాండ్‌ శానిటైజర్‌ దొరకని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఆన్‌లైన్, ఆఫ్‌ లైన్, మెడికల్‌ షాప్స్‌ ఇలా ఎక్కడ కూడా నోస్టాక్‌ అంటూ చెప్పేస్తున్నారు. 

 

అయితే అత్యధిక రేటు ఉండే హ్యాండ్‌ శానిటైజర్‌లు సులభంగా ఇంటిలోనే ఎలా తయారు చేసుకోవాలి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు.. రెండు కప్పుల రబ్బింగ్‌ ఆల్కహాల్‌.. ఈ రబ్బింగ్ ఆల్కాహాల్ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్ స్టోర్‌లో లభ్యమవుతుంది.  ఒక కప్పు అలోవెరా జెల్.. ఇది మ‌న‌కు ఇంట్లోనే న్యాచుర‌ల్‌గా దొరుకుతుంది. మ‌రియు 8 నుంచి 10 చుక్కల టీట్రీ ఎసెన్షియల్‌ ఆయిల్ తీసుకోవాలి.

 

తయారీ విధానం.. రబ్బింగ్‌ ఆల్కహాల్‌ను, అలోవెరా గుజ్జును ఓ పాత్రలో తీసుకుని స్పూన్‌తో బాగా మిక్స్ చేసుకోవాలి. అలా కలుపుతూ.. చివర్లో ఎసెన్షియల్ ఆయిల్‌ను కలపాలి. అంతే సులువుగా హ్యాండ్‌ శానిటైజర్‌ రెడీ అయినట్లే. ఈ మిశ్రమాన్ని ఏదైన బాటిళ్లో పోసి.. ఉపయోగించుకుంటే చాలు. అయితే ఖచ్చితంగా ఈ మిశ్నమాన్ని కలిపే సమయంలో దానిలో రబ్బింగ్ ఆల్కహాల్ 60 శాతం ఉండాలి. లేదంటే ప్రమాదమంటున్నారు వైద్య నిపుణులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: