నిర్భయ కేసులో ఎట్టకేలకు న్యాయం జరిగింది. ఎన్నో రోజుల పాటు వరుసగా వాయిదా పడుతూ వచ్చిన నిర్భయ దోషులకు ఉరి అమలుకు మార్గం సుగమం చేసింది కోర్టు.  న్యాయస్థానాలను చులకన చేస్తూ... చట్టాలలో లోసుకోగలని  వాడుకుంటూ... కోర్టులు  ఉరి శిక్ష విధించినప్పటికీ.. భారత చట్టాల లో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ఇన్ని రోజుల వరకు కాలం గడుపుతూ వచ్చిన నిర్భయ దోషులకు ఉరి తధ్యంగా  మారిపోయింది. తమకు ఇంకా న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయి అంటూ నిర్భయ దోషులు దాఖలు చేసిన పిటిషన్లను నేడు ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. నిర్భయ దోషులకు ఉరి తీత  అమలు నిలిపి వేయాలంటూ నిర్భయ కేసులో నలుగురు దోషులకు పిటిషన్లు దాఖలు చేయగా... వాటన్నింటినీ కొట్టివేస్తూ న్యాయస్థానం వారికి మరణ శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. 

 

 

 అయితే ఇప్పుడు వరకు న్యాయపరంగా ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ఉరిని వాయిదా పడేలా చేస్తూ వస్తున్న నిర్భయ కేసులో నిందితులకు ఎట్టకేలకు ఉరి ఖరారైంది . ఎన్నో రోజుల నుండి న్యాయం కోసం పోరాటం చేస్తున్న నిర్భయ తల్లి పోరాటానికి ఫలితం దక్కింది. ఇప్పటివరకు నిర్భయ కేసులో నిందితుడు పవన్ అక్షయ్  దాఖలు చేసిన క్షమాభిక్ష పిటీషన్ను రాష్ట్రపతి తిరస్కరించారు అంటూ  పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇర్ఫాన్  అహ్మద్ పటియాల హౌస్ కోర్టుకి  తెలియజేశారు. నా స్నేహితుడితో వంద పిటిషన్లు వేయించ గలను ... అలాంటి పిటిషన్లను కూడా న్యాయపరమైన అవకాశాలుగా భావిస్తే ఎలా అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇర్ఫాన్ అహ్మద్ కోర్టులో వాదనలు వినిపించారు. 

 

 

 ఇక కోర్టులో నిర్భయ దోషులకు ఉరి వాయిదాపై వాదనలు జరుగుతున్న సమయంలో.. అదే కోర్టులో ఉన్న నిర్భయ దోషి అక్షయ్ భార్య స్పృహ  కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆమె కింద పడిపోవడంతో కోర్టులో కాసేపు కలకలం రేపింది. అయితే నిర్భయ కేసులో దోషి అక్షయ్ భార్య కొన్ని నెలల కిందటే అక్షయ్ తో విడాకులు కోరుతూ డైవర్స్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఇదిలా ఉంటే రేపు ఉదయం ఐదున్నర గంటలకే నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. డెత్ వారెంట్  పై స్టే విధించాలని కోరుతూ కోర్టులో నిర్భయ దోషులు  పిటిషన్ ను కొట్టివేసింది పటియాల కోర్టు. నిర్భయ కేసులోని పవన్,ముఖేష్, అక్షయ్. వినయ్ లకు రేపు ఉరి శిక్ష అమలు కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: