రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయటం మనకందరికీ తెలిసినదే. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో సీరియస్ అయ్యారు. ఎవరినీ సంప్రదించకుండా ఎన్నికలు ఏ విధంగా వాయిదా వేస్తారు అంటూ మీడియా సమావేశం పెట్టి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వటం జరిగింది. ఇదే తరుణంలో సుప్రీంకోర్టు కూడా వెళ్లిన జగన్ సర్కార్ అక్కడ ఆరు వారాల వాయిదా నిర్ణయాన్ని సమర్థించడం జరిగింది. అయితే ఇదంతా తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు దర్శకత్వంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పని చేయడం జరిగిందని...రాష్ట్రంలో వైసీపీ పార్టీ బలమైన మెజార్టీ స్థానాల్లో గెలుస్తుంది అన్న భయంతో ఎన్నికలను వాయిదా వేయించటం జరిగిందని వైసీపీ నేతలు ఆరోపించారు.

 

చంద్రబాబు మరియు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో రాష్ట్రానికి రావాల్సిన ఐదువేల కోట్లను అడ్డుకునీ రాక్షస ఆనందం పొందుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుల పై వైసీపీ నేతలు మండిపడ్డారు. అయితే ఈ విషయం ఢిల్లీ దాకా వెళ్లడంతో, ఇటువంటి తరుణంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీకి రావాలని ఫోన్ చేయడం జరిగిందట. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఈ విధంగా వ్యవహరించడాన్ని చాలామంది రాష్ట్రంలో ఉన్న సీనియర్ రాజకీయ నేతలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మండిపడుతున్నారు.

 

ఇప్పటికే బిజెపికి మరియు తెలుగుదేశం పార్టీ నేతలకు సరిగ్గా పడటంలేదు...ఇటువంటి తరుణంలో ఒక బాధ్యతగల పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ డైరెక్షన్లో వ్యవహరించినట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుండి వివరణ తీసుకుంటారా..? లేకపోతే పదవి నుండి తప్పించి వేరొకరిని నియమిస్తారా..? అన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: