ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో భయపడిపోతున్నారు. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రజలను ప్రభుత్వాలను పరుగులు పెట్టిస్తోంది. ముఖ్యంగా ఇటలీ నగరంలో ఈ వైరస్ వల్ల చాలామంది మరణించడం జరిగింది. దీంతో ఇటలీ దేశంలో ప్రజలు ఎవరూ కూడా రోడ్లపైకి రాకుండా ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా అరెస్ట్ అవడం గ్యారెంటీ అంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇండియాలో కూడా ఈ వైరస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. దాదాపు 150కి పైగా కేసులు నమోదు కావడంతో కేంద్ర ఆరోగ్య శాఖ ఎక్కడికక్కడ కఠిన చర్యలు చేపట్టింది.

 

దేశంలో చాలా రాష్ట్రాలలో షాపింగ్ మాల్స్ మరియు కాలేజీలు స్కూల్స్ అన్నీ బంద్ అయిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇటువంటి తరుణంలో డబ్బుల నోటుకి కరోనా సోకినట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళ్తే బ్యాంకుల వినియోగదారులు నేరుగా నగదు బదులు యూపీఐ, నెఫ్ట్, మొబైల్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగించుకునేలా చూడాలని ప్రభుత్వం దేశంలోని బ్యాంకులను కోరింది. 

 

కరోనా వ్యాప్తి నివారణకు ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్రతిపాదన చేస్తున్నట్టు నోటిఫికేషన్ జారీ చేసింది. కరెన్సీ ద్వారా ఈ వైరస్ వ్యాపించవచ్చునని ఊహాగానాలు వినవస్తున్న వేళ ఈ ప్రపోజల్ తెచ్చినట్టు ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా క్రయ విక్రయాలు మీడియా, సోషల్ మీడియా, ఈ-మెయిల్, ఎస్ ఎమ్మెస్ ల ద్వారా డిజిటల్ చెల్లింపులు చేపట్టేలా కస్టమర్లను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే ఆయా బ్యాంకుల బ్రాంచిలు, ఔట్ లెట్ల వద్ద బ్యానర్లు, పోస్టర్ల ద్వారా వారిని ఎడ్యుకేట్ చేయాలని కూడా ఈ శాఖ సలహా ఇచ్చింది. మొత్తంమీద చూసుకుంటే డబ్బు కూడా ఇప్పుడు కరోనా వైరస్ సోకినట్టు అయ్యింది అని ఈ వార్త విన్న వాళ్లు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: