కరోనా ఇప్పుడు ఈ పేరు విన్న చాలు జనాల్లో గుబులు లేపుతుంది. కరోనా వైరస్ పుట్టింది చైనాలో అయినా ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈ వ్యాధితో చిన్న, పెద్దలు అందరు బాధపడుతున్నారు. ఈ వ్యాధి పుట్టిన అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని వేల మంది చనిపోయారు. ఈ వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య చైనా తర్వాత ఇటలీలో ఎక్కువగా ఉన్నారు. 

 

 


ఇంకా కొన్ని లక్షల మందికి చికిత్స అందిస్తున్నారు. అందులో కొన్ని వేల మంది కోలుకుంటున్నారు. 20 నుంచి 40 ఏళ్ల వయస్సు గల వ్యక్తులు ఈ వైరస్ నుంచి త్వరగా కోలుకుంటున్నారు. మధుమేహం, గుండె వ్యాధులతో బాధపడుతున్న రోగులు, 60 నుంచి 80 ఏళ్ల వయస్సు గల వృద్ధులు మాత్రం ఈ వ్యాధి నుంచి కోలుకోవడం కష్టతరంగా మారింది. అలాంటి కరోనాతో బాధపడుతున్న103 ఏళ్ల భామ ఈ వ్యాధి నుండి కోలుకోని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన ఇరాన్‌ లో చోటు చేసుకుంది.

 

 


ఇరాన్ కు చెందిన 103ఏళ్ల భామకు వారం రోజుల క్రితం కరోనాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు అందరు భామ బ్రతకటం చాలా కష్టమని వైద్యులు అందరు భావించారు. ఆమె ఆ వైరస్‌ను తట్టుకోగలిగింది. తిరిగి తన ఆరోగ్యాన్ని సంపాదించింది. ఇదే దేశంలో కెర్మన్‌కు చెందిన 91 ఏళ్ల వృద్ధుడు సైతం కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆశ్చర్యపరిచాడు. అతడికి రక్తపోటు, ఉబ్బసం వ్యాధులు ఉన్నా సరే ఆయన తిరిగి ఆరోగ్యాన్ని పొందడం అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

 

 


మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా అధికారులతో కలిసి కరోనా వైరస్ మరణాలపై కొన్ని కీలక విషయాలు తెలిశాయి. ఇరాన్‌లో ఇప్పటివరకు మొత్తం 17,361 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు 1135 మంది చనిపోయారు. ఇక్కడ ఒక్క రోజులోనే 147 మంది చనిపోవడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: