ప్రపంచ యుద్ధం జరుగుతున్న కూడా ఇంతగా విధ్వంసం ఉండదేమో.. కానీ కరోనా అనే క్రిమీ చేస్తున్న మారణహోమం అంతాఇంతా కాదు.. ఒక్కరితో మొదలెట్టిన తన ప్రస్దానం ఇప్పుడు వందలు వేలు దాటింది.. ఇది లక్షల్లోకి మారక ముందే కఠినమైన చర్యలు చేపట్టవలసిందే.. లేదంటే ఇది మూడో ప్రపంచ యుద్దంకంటే దారుణంగా ఉంటుంది.. ఎందుకంటే ఈ యుద్ధంలో బాంబులు పేలడం లేదు.. అణుబాంబులు ప్రయోగించడం లేదు.. కానీ అంతకంటే ఎక్కువగా నష్టం జరుగుతుంది.. ఆర్దిక నష్టం ఒకవైపు, ప్రాణ నష్టం మరోవైపు.. ఇలాంటి పరిస్దితి నుండి తిరిగి కోలుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో బలహీనమైన దేశాలకు చెప్పలేం..

 

 

ఇకపోతే కరోనా వైరస్ విసృతంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రజలందరు ఇళ్లకే పరిమితం కావాలని హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.. అయితే, చాలామంది దీన్ని తేలిగ్గా తీసుకుని, మాస్క్ పెట్టుకుని ఎక్కడైనా తిరగవచ్చని భావిస్తున్నారు. కరోనా అంటే ఏదో చిన్న టైఫాయిడ్, మలేరియాలా తీసేస్తున్నారు.. గానీ దీని బలాన్ని గుర్తించలేక పోతున్నారు.. అయితే చిన్న నిర్లక్ష్యమే ఎన్ని ప్రాణాలు పోవడానికి కారణం అవుతుందో చెబితే మొద్దు బుర్రలకు ఎక్కడం లేదు.. కనీసం ఇక్కడ చెబుతున్న ఉదాహరణను అయిన జాగ్రత్తగా గమనిస్తే చాలు.. అదేమంటే..

 

 

ఒక్క అగ్గిపుల్ల మీద చేసిన వీడియో.. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఒక్కరు అప్రమత్తంగా ఉంటే వందలాది ప్రాణాలను కాపాడిన వాళ్లం అవుతామని, ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలనే సందేశాన్ని అందిస్తోంది.. ఇక ఈ వీడియోలో చూస్తే కొన్ని అగ్గిపుల్లలు లైనుగా నిలుచుని ఉన్నాయి. వాటిలో అగ్గి పుల్లకు మంట పెడితే.. అది వరసగా పక్కన ఉన్న అగ్గిపుల్లలకు కూడా ఆ మంటను వ్యాప్తి చేస్తోంది. అయితే, వాటిలో ఉన్న ఓ తెలివైన అగ్గిపుల్ల ఆ మంట తనకు అంటుకోకుండా పక్కకు తప్పకుంది. అంతే, ఆ మంట ఆ అగ్గిపుల్ల వద్దే ఆగిపోయింది.

 

 

ఒక్క అగ్గిపుల్ల పక్కకి తప్పుకోవడం వల్ల మిగతా అగ్గిపుల్లలు మండి పోకుండా క్షేమంగా ఉన్నాయి. ఇకపోతే ఈ కరోనా వైరస్ కూడా అలాంటిందే. ఎందుకంటే ఎవరిని లెక్కచేయకుండా బయటకు వెళ్లి ఈ రోగాన్ని అంటించుకున్నామంటే ఆ వైరస్ మనతో పాటుగా, మన కుటుంబ సభ్యులకు, మన చుట్టుపక్కల వారికి వ్యాప్తిచెంది పరిస్థితులు దయనీయంగా మారతాయి. ఏ ఒక్కరు అప్రమత్తంగా ఉన్నా ఈ వైరస్ మధ్యలోనే ఆగిపోయి అంతమవుతుంది. అందుకే కరోనాను అంతం చేసే సత్తా మనలోనే ఉంది. కాబట్టి.. జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఇప్పుడున్న పరిస్దితుల్లో మొండితనానికి పోయి కరోనా ఉగ్రవాదుల్లా మారకండి..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: