ఏపీ ప్రభుత్వం ఉగాదికి 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు గతంలోనే ప్రకటించింది. రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సొంత ఇల్లు లేకుండా ఎవరు ఉండకూడదని జగన్ ప్రతిపక్షంలో ఉన్న టైంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో మరియు ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములను మరియు అదే విధంగా అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది. భూములు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో కూడా భూసేకరణ చేపట్టేది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలకు సెంటు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి తింటున్నారా భూమి లబ్ధిదారులకు అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

 

ఇటువంటి టైం లో ప్రభుత్వం ఎన్నికలు కట్టడంతో కోడ్ అమల్లోకి రావటంతో కొత్త పథకం కావడంతో ఎన్నికల సమయంలో ఇస్తే ఓటర్లను ప్రలోభ పెట్టి నట్లు అవుతుంది ఎస్‌ఈసీ ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల సుప్రీంకోర్టు కోడ్ ఎత్తివేయడం జరిగింది. అయితే ఇదే సమయంలో కొత్త పథకాలు ఏమి ప్రవేశపెట్టవద్దని స్పష్టం చేసింది. మరి ఇలాంటి టైమ్ లో ఇళ్ల పట్టాలు విషయంలో ఎదురు చూస్తున్న లబ్ధిదారులు ఉగాది పండుగ నాడు  ప్రభుత్వం భూ పట్టాలు ఇస్తుందో లేదో అన్న టెన్షన్ లో ఉండిపోయారు.

 

కచ్చితంగా ఈ విషయంలో న్యాయస్థానం ఆదేశాలను లెక్క చేయకుండా జగన్ ముందుకు వెళితే తిప్పలు తప్పవని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. మరోపక్క వైసిపి నాయకులు ఇది పాత పథకం అని అంటున్నారు. ఇరవై ఐదో తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ చేపడతామని.. స్పష్టం చేస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కొత్త కార్యక్రమం అని ప్రభుత్వమే గతంలో చెప్పిందని టీడీపీ నేతలంటున్నారు. ఇంతవరకు ప్రారంభించని పథకాన్ని కొత్త పథకం కాక ఏమంటారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇటువంటి కీలక టైం లో ముఖ్యమంత్రి జగన్ స్వయంగా క్లారిటీ ఇస్తే బాగుంటుందని అంటున్నారు ఏపీ ప్రజలు.

మరింత సమాచారం తెలుసుకోండి: