భారత ప్రభుత్వం ఒక పక్క కోరలు చాచి అమిత వేగంతో విస్తరించిన కరోనా మహమ్మారిని అరికట్టేందుకు తన వంతు ప్రయత్నాలను ఎంతో శ్రద్ధతో మరియు ఏకాగ్రతతో చేస్తున్నా భారత ప్రజల నుంచి మాత్రం వారికి కనీస సహకారం కొదవైంది. చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ దేశ ఆర్థిక పరిస్థితిని కూడా లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్యమే తమ మొదటి లక్ష్యం అని అటు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటే ప్రజలు మాత్రం వాటిని బేఖాతరు చేస్తున్నారు.

 

దాదాపు అన్ని రాష్ట్రాలలో పిల్లలకు మరియు యువతీయువకులకు స్కూళ్ళు మరియు కాలేజీ లకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగం చేసే వారందరికీ ఇంటినుండే వారి ఉద్యోగాలు చేసుకునేటట్లు కూడా వీలుని కల్పిస్తూ ప్రభుత్వం ఆఫీసులు అన్నింటికీ ఎవరితోనూ ఆఫీసులో పని చేయించుకోవద్దని తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. సమయాన్ని సద్వినియోగ పరచుకుని తమను తాము కాపాడుకోవడం మానేసి ప్రజలంతా ఏదో వారికి జాలీగా ఎంజాయ్ చేయమని సెలవులు ఇచ్చినట్లు వివాహాలకు, షాపింగ్ లకు, సినిమాలకు మరియు ట్రిప్ లకు వెళ్తున్నారు.

 

అదీ కాకుండా వారి పరిసరాల్లో విదేశాల నుండి వచ్చిన వారు ఉన్నా కూడా దగ్గరలోని అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వాలు ఎన్నిసార్లు మొత్తుకుంటున్నా వారి మాటలను పెడచెవిన పెడుతున్నారు. చివరికి వారే బాధితులై ఆస్పత్రిలో బిక్కుక్కుమంటూ చేరుతున్నారు. నేడు తెలంగాణలోని కరీంనగర్ లో ఏడుగురు ఇండోనేషియా నుండి వచ్చిన బృందం కరోనా పాజిటివ్ అని తేలగా ఇన్ని రోజులు అసలు వారు ఎటువంటి టెస్ట్ లు చేయించుకోకపోవడం.. ఎవరి కంటా పడకపోవడం చూసి వైద్యాధికారులు ఆశ్చర్యపోయారు. భారత పౌరులు ఇక పై ఇలాగే ప్రవర్తిస్తే మాత్రం దేశం మొత్తం అన్ని రంగాలలో కుదేలైపోతుంది అన్నది అక్షర సత్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: