ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా గొడవ ఏపీ రాజకీయాలను కుదిపేసింది. కావాలనే టీడీపీ అధినేత చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ పేరుతో వాయిదా వేయించటం ఏపీ రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది. హైకోర్టు మార్చి నెలాఖరుకల్లా లోకల్ బాడీ ఎలక్షన్లు కంప్లీట్ చేయాలని ఏపీ ప్రభుత్వానికి గతంలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లేకపోతే 14వ ఆర్థిక సంఘం నుండి రావలసిన ఐదు వేల కోట్ల నిధులు ఆగిపోతాయని తీర్పు ఇవ్వడంతో వెంటనే జగన్ సర్కార్ లోటు బడ్జెట్ కలిగిన రాష్ట్రం నేపథ్యంలో ఎన్నికల కోసం సిద్ధం అయింది.

 

ఇటువంటి టైం లో ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత కుదేలు చేసే విధంగా చంద్రబాబు డైరెక్షన్లో ఎన్నికల కమిషనర్ వ్యవహరించడంతో జగన్ సర్కార్ సుప్రీం కోర్ట్ కి వెళ్ళగా అక్కడ టీడీపీ చెంప చెల్లుమనేలా తీర్పు వచ్చింది. అంతేకాకుండా ఎన్నికల అధికారిని మందలించింది. ఎన్నికలు ఎప్పుడు జరపాలన్నది రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని, కరోనాపై ఆంక్షలు పెట్టుకో సంక్షేమంపైన కాదు. ఎన్నికల కోడ్ తక్షణమే ఎత్తివేయాలని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలి చెప్పడం జరిగింది.

 

దీంతో ప్రజలకు ఊరట కలిగిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు “ఎలక్షన్ కోడ్ ఎత్తివేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుపేదలకు ఊరట కలిగించాయి. పంపిణీ చేసే స్థలాల్లో గృహ నిర్మాణం కోసం సిమెంట్ ధరలను భారీగా తగ్గించేలా కంపెనీలను ఒప్పించడం సిఎం జగన్ గారి గొప్ప విజయం” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొత్తం మీద సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీలో నిరుపేదలు ఎక్కువగా ఉండటంతో ఈ తీర్పు బంగారం లాంటి వార్తగా వారి జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చింది. 





మరింత సమాచారం తెలుసుకోండి: