జగన్ స్టైల్ వేరుగా ఉంటుంది. ఎంత దగ్గర ఉన్నా ఆయనకు నచ్చితేనే పట్టించుకుంటారు. ఎంత దూరంగా ఉన్నా తాను నచ్చుకుంటే ఆదరిస్తారు. ఓవయాక్షన్ ఎవరు చేసినా కూడా జగన్ ఇట్టే గ్రహిస్తారు. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ కి కుడి భుజం లాంటి ఓ మంత్రి గారు ఇపుడు ఒక్కసారిగా  సైలెంట్ గా ఉండడం వైసీపీలో పెద్ద చర్చకు దారితీస్తోంది.

 

ఆయన క్రిష్ణా జిల్లాకు చెందిన మంత్రి కొడాలి నాని. ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నాని గెలిస్తే అందులో రెండు సార్లు వైసీపీ, రెండు సార్లు టీడీపీ తరఫున ఖాతా గెలుపు  ఉంది. ఇక జగన్ పార్టీలో పెద్ద నోరున్న మంత్రిగా తరచూ ప్రభుత్వాన్ని రక్షిస్తూ కొడాలి నాని మీడియా ముందుకు వచ్చేవారు. ఇపుడు ఆయన అయిపూ అజా లేరు.

 

ఇక ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్ ఉండనే ఉంది. ఆయన్ని జగన్ కులం పేరు పెట్టి బాబుకు అంటగట్టారు. ఇటువంటి టైంలో జగన్ కి కమ్మలను దూరం చేసే పనిని విజయవంతంగా టీడీపీ చేపట్టింది. అయితే జగన్ కి కులాలు, మతాలు లేవని ఆయనకు అందరూ ఒక్కటేనని పదే పదే చెప్పే కొడాలి నాని ఇపుడు సౌండ్ చేయకపోవడం విడ్డూరమే అంటున్నారు.

 

నాని ఎందుకు జగన్ కి దూరం జరిగారు. కీలకమైన సమయంలో ఎందుకు నోరు విప్పలేదన్న్న ప్రశ్న వస్తోంది. జగన్ క్యాబినేట్లో ఒక్కరే కమ్మ మంత్రిగా నాని ఉంటే ఆ మంత్రి నోరు విప్పి వైసీపీ పక్షాన మాట్లాడకుండా మౌనం దాల్చడం ఏంటన్న మాట కూడా వినిపిస్తోంది. మరో వైపు చూసుకుంటే నాని కొంతకాలంగా  తగ్గి ఉంటున్నారు. దానికి కారణం సొంత సామాజికవర్గంలో ఆయన‌కు వచ్చిన వ్యతిరేకత కారణం అంటున్నారు.

 


అమరావతి రాజధాని విషయంలో జగన్ వైఖరి మొత్తం కమ్మ‌ కులానికే  ఆగ్రహంగా మారిందని, ఆ టైంలో జగన్ పక్షాన నిలిచి నాని కూడా చెడ్డ అయ్యారని అంటున్నారు. నానికి చంద్రబాబు అంటే పడదు, అది పచ్చి నిజం. అదే సమయంలో బాబు లేని టీడీపీలోకి, జూనియర్ ఎన్టీయార్  కనుక సారధ్యం వహిస్తే ఆయన వెళ్ళేందుకు సిధ్ధమని కూడా అంటున్నారు. అయితే కమ్మ కులంలో  ఆదరణ తగ్గితే నానికి తీరని నష్టం అవుతుంది.

 

ఈ క్రమంలో నానికి కొందరు సొంత సామాజికవర్గం నేతలు కులానికి దూరం కావద్దు అని చెప్పారట. పార్టీలు, రాజకీయాలు వస్తూంటాయి, పోతూంటాయి. కులాన్ని దూరం చేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు  తప్పవని నచ్చచెప్పడంతోనే ఆయన నిమ్మ‌గడ్డ ఎపిసోడ్ లో ఎక్కడా  పెదవి విప్పడంలేదని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: