జగన్మోహన్ రెడ్డి  చేసిన ఒకే ఒక్క  పనితో కాపు సామాజికవర్గం ఫుల్లుగా హ్యాపీగా ఉందట.  ఒకే దెబ్బకు జగన్ ప్రభుత్వం కాపుల మీదున్న కేసులను ఎత్తేసింది. చంద్రబాబునాయుడు హయాంలో కాపులను బిసిల్లో కలపాలనే డిమాండ్ తో ఉద్యమం చేసిన విషయం గుర్తుందా ? ఉద్యమంలో భాగంగానే  తూర్పుగోదావరి జిల్లాలోని తునిలో ముద్రగడ బహిరంగసభ నిర్వహించారు. ఆ సమయంలో కొందరు ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పుపెట్టారు. దాంతో ఆ ఘటన దేశంలోనే సంచలనమైంది.

 

ఎప్పుడైతే రైలు దహనం అయ్యిందో వెంటనే వందలాది మంది కాపులపై అప్పటి ప్రభుత్వం కేసులు పెట్టింది. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ తగలబడగానే ఆపని చేసింది పులివెందుల గుండాలు, రాయలసీమ రౌడీలే అంటూ చంద్రబాబు, అప్పటి మంత్రులతో పాటు మొత్తం పసుపు నేతలు ఆరోపణలు అందరికీ గుర్తుండే ఉంటుంది. పైగా జగన్మోహన్ రెడ్డే తన మనుషులతో ఈ పని చేయించారంటూ పదే పదే చంద్రబాబే ఆరోపించాడు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆరోపణలన్నీ జగన్ మీదే చేసిన అదుపులోకి మాత్రం కాపు నేతలనే తీసుకున్నారు. ఘటనపై సిట్ ను ఏర్పాటు చేసిన చంద్రబాబు తర్వాత జగన్ ప్రమేయాన్ని మాత్రం నిరూపించలేకపోయాడు. సిట్ సూచనల మేరకు ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కాపు నేతలను అరెస్టులు చేశారు. వీరిలో కొందరిని వదిలిపెట్టినా చాలామందిని కోర్టులో పెట్టి రిమాండ్ కు పంపారు.

 

అప్పటి నుండి సంబంధం లేని కాపులపై కేసులు పెట్టినందుకు కాపు సామాజికవర్గం మొత్తం చంద్రబాబుపై మండిపోయింది. చంద్రబాబు అధికారంలో ఉన్నంత వరకూ  కాపులను పోలీసుస్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతునే ఉన్నారు. సీన్ కట్ చేస్తే మొన్నటి ఎన్నికల్లో జగన్ అత్యధిక మెజారిటితో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. వైసిపి ప్రభుత్వం రాగానే కాపులపై కేసుల విషయం ప్రస్తావనకు వచ్చింది. న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత తాజాగా రైలు దహనం కేసులన్నింటినీ ప్రభుత్వం ఎత్తేసింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: