ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో  కేంద్ర హోంశాఖ కార్యదర్శికి అందిన లేఖతో తెలుగుదేశంపార్టీ ఇరుక్కుపోయిందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. అవసరానికి తెలుగుదేశంపార్టీ ఎవరినైనా వాడుకుని తర్వాత అలాంటి వాళ్ళని వదిలేయటం చంద్రబాబునాయుడుకు బాగా అలవాటే. ఇపుడు నిమ్మగడ్డను కూడా ఇలాగే వాడుకుని వదిలేద్దామని అనుకుంటే సాధ్యంకాక టిడిపి ఇరుక్కుపోయిందా ? అనే అనుమానాలు పెరుగుతున్నాయి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తన పేరుతో కేంద్ర హోంశాఖ కార్యదర్శికి అందిన లేఖతో తనకు సంబంధం లేదని, తాను రాయలేదని నిమ్మగడ్డ ఏఎన్ఐ అనే న్యూస్ సంస్ధకు స్పష్టం చేశాడు. కానీ తెలుగుదేశంపార్టీ నేతలు మాత్రం సదరు లేఖను నిమ్మగడ్డే రాశాడంటూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఎవరి పేరుతో అయితే లేఖ వెళ్ళిందో ఆయనే తనకు లేఖతో సంబంధం లేదని మొత్తుకుంటుంటే టిడిపి నేతలు మాత్రం లేదు లేదు ఆయనే లేఖ రాశాడంటూ ఎందుకు అంతగా చెబుతున్నారు ? ఇక్కడే టిడిపి నేతలపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

నిజానికి నిమ్మగడ్డ పేరుతో వెళ్ళిన లేఖలోని అంశాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. పైగా ఆ అంశాలన్నీ ప్రతిరోజు చంద్రబాబునాయుడు మీడియాలో చేస్తున్న ఆరోపణలే కావటం గమనార్హం. అందుకనే టిడిపి పాత్రపై అందరు అనుమాన పడుతున్నారు. అసలు లేఖపై ఇంత గొడవ జరుగుతుంటే నిమ్మగడ్డ మాత్రం ఎందుకు మవునంగా ఉన్నారో అర్ధం కావటం లేదు. ఒకవేళ నిమ్మగడ్డ అనుమతితోనే టిడిపి నేతలెవరైనా లేఖ రాశారా ? అని కూడా అనుమానాలున్నాయి.

 

సరే ఎవరి గోల ఎలాగున్నా వైసిపి ఎంఎల్ఏలు  ఇదే విషయాన్ని డిజిపి గౌతమ్ సవాంగ్ దృష్టికి తీసుకెళ్ళారు. సైబర్ క్రైమ్ అధికారులతో దర్యాప్తు చేయించి వెంటనే నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బిజెపి రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు మాట్లాడుతూ నిమ్మగడ్డ స్పందించి లేఖ విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నిమ్మగడ్డే లేఖ రాశాడని టిడిపి నేతలు చెప్పటం చాలా విచిత్రంగా ఉందన్నాడు. ఏదేమైనా  గట్టిగా దర్యాప్తు జరిగితే ముందు టిడిపినే ఇరుక్కునేట్లుంది చూడబోతే.

మరింత సమాచారం తెలుసుకోండి: