ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇప్పటివరకు 176 దేశాలకు విస్తరించింది. కరోనా భారీన పడి ఇప్పటివరకు 9,177 మంది మృతి చెందారు. ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య 2,00,000 దాటగా ఈ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకూ కరోనా సోకి నలుగురు మృతి చెందారు. చైనాలో ఇప్పటివరకూ కరోనా భారీన పడి 3245 మంది మృతి చెందగా ఇటలీలో 2,978 మంది మృతి చెందారు. 
 
ఏపీలో ఇప్పటివరకూ రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వైసీపీ నేతలు కొందరు కరోనా మాస్కులను పంపిణీ చేస్తున్నారు. మాస్కులు పంపిణీ చేయడం మంచి నిర్ణయమే కదా...? అని అనుకుంటున్నారా...? అందులోనే ట్విస్ట్ ఉంది. రాష్ట్రంలో వైసీపీ నాయకులు వైసీపీ పేరుతో మాస్కులను పంపిణీ చేస్తున్నారు. 
 
కరోనా కారణంగా ఎన్నికలు ఆగిపోయినా ఎన్నికలు మరికొన్ని రోజుల్లో నిర్వహించే అవకాశం ఉండటంతో అధికార పార్టీ నాయకులు మాస్కుల పంపిణీకి శ్రీకారం చుట్టాయి. రాష్ట్రంలో మాస్కుల కొరత తీవ్రంగా ఉండటంతో వైసీపీ నేతలు దీన్ని కూడా వాడుకోవాలనుకుని కొత్త ఆలోచన చేశారు. ప్రతిపక్ష టీడీపీ నుంచి వైసీపీ మాస్కులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 
ప్రభుత్వం ఏపీలో కరోనా నియంత్రణకు తగిన చర్యలు చేపడుతోంది. వైసీపీ నాయకులు వైసీపీ మాస్కులను తయారు చేయించి పలు గ్రామాల్లో ప్రజలకు అందజేస్తున్నారు. వైసీపీ నేతలు వైసీపీ ఎన్నికల గుర్తు, సీఎం జగన్ ఫోటోను కలిపి మాస్కులను రూపొందించారు. వైద్యులు కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మాస్కులు ధరించాలన్న డాక్టర్ల సూచనను అనుకూలంగా మార్చుకుంటున్నారు. రాజకీయ పార్టీలు మాస్కులను కూడా ప్రచారం కోసం వాడుకోవడంపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: