తెలంగాణ ప్రజలను కోవిడ్‌ వైరస్‌ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కాగా, తెలంగాణ ప్రజలను కోవిడ్‌ వైరస్‌ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.  అయితే  మరో నిమిది కొత్త కేసులు నమోదైనట్టు వెల్లడించింది.  దీంతో హైదరాబాద్ వాసులు  భయాందోళనకు గురవుతున్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ఇప్పటికే పటిష్ట చర్యలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం.. విదేశాల నుంచి వచ్చేవారిని క్యారంటైన్‌లో ఉంచడానికి మరో 10వేల పడకలను సిద్ధం చేయనుంది.  కాకపోతే కొత్తగా కరోనా పాజిటివ్‌గా తేలిన బాధితులెవరూ తెలంగాణ వారు కాదు. వారంతా ఇండోనేషియాకు చెందినవారే.

 

ఇండోనేషియా నుంచి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు ఉండడంతో వారిని గాంధీకి తరలించారు. నిన్న ఉదయమే యూకే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో బుధవారం ఒక్కరోజే తెలంగాణలో 8 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టయ్యింది. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారికి గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు.  కరోనా వైరస్ నిర్ధారణ అయిన వ్యక్తులు, అనుమానితులను ఈ కేంద్రాలకు తరలించమని, కేవలం విదేశాల నుంచి వచ్చేవారిని మాత్రమే ఇందులో క్వారంటైన్‌లో ఉంచుతామని పేర్కొన్నారు.

 

ఇదిలా ఉంటే.. లంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కరోనా కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే కరోనాపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారికే వైరస్‌ సోకుతున్నందువల్ల వారికి సంపూర్ణ వైద్య పరీక్షలు నిర్వహించాలనీ ఆదేశించారు.  సామూహికంగా జరిగే పండుగలు, ఉత్సవాలకు దూరంగా వుండాలని కోరారు. కరోనాపై ప్రభుత్వం తీసుకునే చర్యలను ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: