ఏదైన ఒక వ్యాధి వ్యాపించడానికి పెద్దగా సమయం పట్టక పోవచ్చును. కానీ అది పూర్తిగా నయం కావాలంటే ఇన్ని రోజులని, నెలలని ఎలాంటి సమయం ఉండదు.. విధ్వంసం జరిగినంత సులువుగా, దాని సృష్టి జరగదు.. అందుకే ప్రపంచం మొత్తం వ్యాపించిన కరోనా అనే వైరస్ వల్ల జరుగుతున్న నష్టాన్ని, జరిగిన నష్టాన్ని పూడ్చడం మాటల్లో చెప్పినంత సులువు కాదు.. ఇకపోతే అతి రహస్యంగా జీవాన్ని పోసుకున్న ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది..

 

 

ఇక లోకంలో ఇలాంటి ఊపద్రవం ముంచుకొస్తుందనడానికి నిదర్శనంగా ప్రకృతి కొన్ని సూచనలు పంపిందట.. అదేమంటే గత కొంతకాలం నుండి ప్రకృతిలో చెప్పలేని విధంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. ఇదంతా పర్యావరణ కాలుష్యం వల్ల జరుగుతుందని భావించారు కాని మానవాళికి ఏదో ముప్పు వాటిల్లుతుందని ఎవరు గ్రహించ లేదట.. ఒకవేళ ఇలాంటి పరిస్దితుల్లో ఈ వైరస్ బలపడి ఉండవచ్చనే అనుమానాలను కొందరు వెళ్లడిస్తున్నారట.. కాగా చైనా వారు దీన్ని తయారు చేశారనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో పలు పరిశోదనలు.. ప్రయోగాలు చేసిన తర్వాత అమెరికాకు చెందిన స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ వారు కరోనా వైరస్ అనేది సహజ సిద్దంగా పుట్టిందని నిర్ధారించారు.

 

 

అంతే కాకుండా ఈ వైరస్ ను కృత్రిమంగా సృష్టించడం ఎవరికి సాధ్యం కాదని.. ఇది గబ్బిలం నుండి మనుషులకు రావడంతో ఇప్పుడు మనుషులు ఇబ్బందులకు గురవుతున్నారు తప్ప ప్రత్యేకంగా దీన్ని తయారు చేయడం జరగలేదని వారు క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ఈ వైరస్ కు వ్యాక్సిన్ తయారు చేయడం ఎందుకు ఆలస్యం అవుతుందో అనే విషయాన్ని వివరిస్తూ, కరోనా వైరస్ మూలభాగం ఇప్పటి వరకు గుర్తించిన వైరస్ ల మూల భాగం కంటే చాలా విభిన్నంగా ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

 

 

ఇక ఇప్పటి వరకు ఈ కరోనా మానవ సృష్టి అంటూ వచ్చిన పుకార్లకు శాస్త్రవేత్తలు క్లారిటీ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఆ ప్రచారం ఆగిపోనుందని అనుకుంటున్నారట... ఇకపోతే ఇప్పటి వరకు అధికారికంగా ఈ వైరస్‌కు మందు కనుగొనబడలేదు.. కావునా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: