ఏపిలో త్వరలో స్దానికంగా ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అక్కడి రాజకీయాలు చాలా రసవత్తంగా సాగుతున్నాయి.. పొయ్యిమీద మరుగుతున్న పాలవలే పొంగుతున్నాయి.. దీనివల్ల అధికార పార్టీ వైసీపీలో ప్రస్తుతం వింత పరిస్థితి నెలకొంది. ఇదివరకు అన్ని నియోజక వర్గాల్లో నేతల మధ్య కొంత విభేదాలున్నా... ఎప్పుడు కూడా సమస్యను భూతద్ధంలో పెట్టి చూడలేదు. ఒకరికొకరు ఎన్నికల సమయాల్లో సహకరించుకునే వారు.. ఇక వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న నేతలు వర్గాలుగా విడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

 

 

ఈ నేపధ్యంలో పార్టీ పరిస్థితులను చక్కదిద్ది నియోజకవర్గ నేతలందరు కూడా ఒకే తాటిమీద సాగేలా చూడాల్సిన అధిష్ఠానం... తాను తీసుకున్న ఓ వింత నిర్ణయంతో ఓ నియోజకవర్గం అధికారికంగానే రెండు ముక్కలైపోయింది. అదే పార్టీకి కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గం.. ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్ డ్ గా కొనసాగుతున్న ఇక్కడ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త బైరెడ్డి రాజశేఖరరెడ్డి సోదరుడి కుమారుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇక్కడి నుంచి ఐజయ్య 2014లో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించి... ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిపోగా, అర్ధర్ అనే కొత్త నేత 2019లో వైసీపీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.

 

 

ఇప్పటివరకు అంతా బాగానే సాగుతుందనుకున్న నేపధ్యంలో వైసీపీ అధికారంలోకి రాగానే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఓ వర్గంగా, అర్థర్ మరో వర్గంగా విడిపోగా, ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి నెలకొంది... సరిగ్గా నిప్పురాజుకుని మండుకుంటున్న సమయంలో పార్టీకి చేయిచ్చిన ఐజయ్యను పార్టీ అదిష్ఠానం తిరిగి పార్టీలోకి చేర్చుకుంది. అయితే అదిష్ఠానం నిర్ణయాన్ని అర్థర్ తీవ్రంగా వ్యతిరేకించగా... బైరెడ్డి మాత్రం స్వాగతించారు. అయినా గానీ ఇక్కడ పార్టీ పరిస్దితి కొంతమేర ఫర్వాలేదని అనిపించినా స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వచ్చేసరికి విషమించింది.

 

 

ఈ నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అర్థర్ - బైరెడ్డి వర్గాలు పంతాలకు పోగా, పంచాయతీ అధిష్టానం వద్దకు చేరింది. ఈ పరిస్దితుల్లో సమస్యను పూర్తిగా పరిష్కరించకుండా ఎమ్మెల్యే అర్థర్ కు రెండు మండలాలను.. మిగిలిన నాలుగు మండలాలను బైరెడ్డి వర్గానికి కేటాయించిన అధిష్ఠానం.. ఫలితంగా నందికొట్కూరు నియోజకవర్గాన్ని అధిష్ఠానమే రెండు ముక్కలు చేసిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: