జగన్ అంటేనే సంచలనం. ఆయన రొటీన్ కి భిన్నం అన్నది చాలా సందర్భాల్లో ప్రూవ్ అవుతూ వచ్చింది. ఆ మాటకు వస్తే జగన్ రాజకీయ జీవితమే ఒక సంచలనం. ఆయన పదేళ్ళ కాలంలో ఒక ఎంపీ స్థాయి నుంచి సీఎం దాక రావడం అతి పెద్ద సంచలనం.  ఇక పది నెలల జగన్ పాలన మరో సంచలనం.

 

ఇన్ని సంచలనాల మధ్య జగన్ కొత్తగా మరో సెన్సేషన్ న్యూస్ చెప్పబోతున్నారు. అదేంటి అంటే  మే 26 నుంచి విశాఖ పరిపాలన రాజధానిగా పాలన కొనసాగించబోతున్నారు. దానికి ముందస్తు కసరత్తు మొదలైంది. ఈ సమాచారం సచివాలయం ఉద్యోగులకు పంపించారు. వారి ఒక మీటింగు పెట్టుకుని మరీ జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా మేము రెడీ అంటున్నారు.

 

ఇక మరో వైపు చూసుకుంటే ఉద్యోగులకు జగన్ సర్కార్ అద్భుతమైన ప్యాకేజిని రెడీ చేసి పెట్టింది. విశాఖలో ఇళ్ళ స్థలాలు, అద్దె ఇంటికి 30 శాతం పైగా అలవెన్స్, ఎన్నో స్పెషల్ అలవెన్సులు, అదే విధంగా వారికి ఇల్లు కట్టుకోవడానికై జీరో వడ్డీకి రుణాలు ఇలా అనేక రకాల తాయిలాలు ఇవ్వడంతో  ఉద్యోగులు ఎగిరి గంతేస్తున్న పరిస్థితి ఉంది అంటున్నారు. ఎందుకంటే విశాఖ లాంటి సిటీలో ఇల్లు కావాలని ప్రతి ఒక్కరి ఆశ. దాన్ని జగన్ కోరకనే నెరవేరుస్తున్నారు.

 

 

మరో వైపు మూడు రాజధానుల వివాదం అలాగే ఉంది. బిల్లు శాసన‌ మండలిలో సెలెక్ట్ కమిటీకి వెళ్ళలేదు. అయినా సరే నిర్ణీత గడువులోగా సెలెక్ట్ కమిటీకి వెళ్ళనందువల్ల అది ఒకే అయినట్లేనని వైసీపీ భావిస్తోంది. మరో వైపు స్థానిక ఎన్నికల తతంగం అలాగే ఉంది. అది జూన్ లో జరగవచ్చు అంటున్నారు. ఈ లోగానే రాజధాని మార్చేసి మే 26 నుంచి విశాఖ నుంచి పాలించాలని జగన్ డిసైడ్ అయ్యారని టాక్. 

 

మరి ఓ వైపు కరోనా ఎఫెక్ట్ ఉంది. ఇంకో వైపు న్యాయ వివాదాలు మూడు రాజధానుల మీద ఉన్నాయి. అందువల్ల అదెంతవరకూ ముందుకు సాగుతుందో చూడాలి. ఏది ఏమైనా అయితే ఈ  ఏడాదికే. లేకపోతే వచ్చే ఏడాది వరకూ  రాజధాని వాయిదా పడుతుందని జగన్ భావిస్తున్నారుట. దాంతో ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నారని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: