ప్రస్తుతం మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత అయిన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత జ్యోతిరాదిత్య సింధియా వెంట ఏకంగా 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం గా మారిపోయింది. ఇక 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడడంతో ముఖ్య మంత్రి కమల్నాథ్ బలపరీక్ష చేసుకోవడం అనివార్యంగా మారిపోయింది. 

 

 

 అయితే మొన్నటికి మొన్న సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా... ముఖ్య మంత్రి కమల్నాథ్ బలపరీక్ష నిరూపించుకోవలసిన సమయం ఆసన్నమైనప్పుడు తీవ్ర గందరగోళం మధ్య అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకు వాయిదా పడ్డాయి. అయితే దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వెంటనే అసెంబ్లీలో బలనిరూపణ  జరగాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు వెంటనే అసెంబ్లీలో కమల్ నాద్  సర్కారు బలనిరూపణకు అవకాశం కల్పించాలంటూ స్పీకర్ ను ఆదేశించింది. 

 

 

 శుక్రవారం ఐదు గంటలకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలంటూ సూచించింది సుప్రీంకోర్టు. కమల్నాథ్ ప్రభుత్వం అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటున్న సమయంలో ఒక వీడియోను చిత్రీకరించడం లేదా... లైవ్ స్ట్రీమింగ్ చేయాలి అంటూ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే సమయంలో 16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు కూడా భద్రత కల్పించాలంటూ మధ్యప్రదేశ్ కర్ణాటక డీజీపీలని ఆదేశించింది అత్యున్నత ధర్మాసనం. ఈ నేపథ్యంలో రేపు కమల్నాథ్ ప్రభుత్వం బలనిరూపణ చేసుకోవడం తధ్యంగా  మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: