కరోనా.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. కొన్ని దేశాల్లో అయితే ఆసుపత్రులు సరిపోవడం లేదు. ఈ వైరస్ మొదట పుట్టిన చైనాలో కరోనా కోసం పది రోజుల్లోనే ఆసుపత్రి కట్టిన సంగతి గురించి అప్పట్లో విచిత్రంగా చెప్పుకున్నాం కదా. మరి ఇప్పుడు ఇండియాలో అంత దారుణంగా లేకపోయినా పరిస్థితి మాత్రం రోజురోజుకూ విషమంగా తయారవుతోంది.

 

 

ఓవైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు.. విదేశాల్లో చిక్కుపడిపోయిన ఇండియన్లు ఇప్పుడు ఇంటిబాట పడుతున్నారు. వారి కోసం ప్రత్యేకంగా క్వారంటేైన్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయోల మోడీ ఓ చక్కని సూచన చేశారు. దేశంలో హెల్త్ ఎమర్జన్సీ వంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాధారణ చికిత్సలను కాస్త వాయిదా వేసుకోవాలని మోడీ పిలుపు ఇచ్చారు.

 

 

సాధారణ సర్జరీలు, అత్యవసరం కాని సర్జరీలను వాయిదా వేసుకోవాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. మనం ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గిస్తేనే వారు ప్రభావవంతంగా సేవలు అందిస్తారని మోడీ ప్రజలకు గుర్తు చేశారు. కరోనా వంటి ఓ మహమ్మారిని ఎదుర్కోవాల్సిన సమయంలో ప్రజల సహకారం చాలా అవరసమే. అందుకే సాధారణ చికిత్సలను కొద్ది రోజులు వాయిదా వేసుకుంటే.. కరోనా సంబంధిత సేవలను చురుకుగా అందించే వీలు ఉంటుంది.

 

 

అలాగే ఇప్పటి వరకూ కరోనా విషయంలో ప్రభుత్వరంగ వైద్య సంస్థలు, ప్రభుత్వ అధికారులే నడుంకడుతున్నారు. ఇప్పుడు ప్రైవేటు ఆసుపత్రులను కూడా కరోనా పై యుద్ధానికి సిద్ధం చేయాలని మోడీ పిలుపు ఇచ్చారు. అంతా కలసికట్టుగా పోరాడితేనే కరోనా పై విజయం సాధిస్తామన్నారు. నిజమే కదా మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: