ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి దేశ ప్రధానులు దేశ ప్రజలకు సూచనలు ఇస్తూనే ఉన్నారు. ఎవరూ కూడా బయటకు రాకూడదు అని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని ఇలా అనేక రకాలుగా సూచనలు ఇస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఇండియా ప్రధాని మోడీ కూడా దేశ ప్రజలను ఉద్దేశించి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. చాలావరకు నిర్లక్ష్యం వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని మోడీ తన ప్రసంగంలో తెలపడం జరిగింది. అయితే ఈ విధంగా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నా ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఇండియాలో ఎక్కువగా కరోనా వైరస్ ప్రభావం మహారాష్ట్రలో ఉంది.

 

ఇటువంటి క్లిష్టమయిన సమయాల్లో మధ్యప్రదేశ్ లో మాత్రం ఎమ్మెల్యేలకు ప్రజల ఆరోగ్యం ఏ మాత్రం పట్టడం లేదు. క్యాంపు రాజకీయాలు చేస్తూ మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికారం డ్రామా ఆడుతున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో నాయకులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తుంటే మధ్యప్రదేశ్ లో మాత్రం అధికార విపక్షాలు కరోనా వైరస్ ని లైట్ తీసుకుని, అధికారం కోసం కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రజల ఆరోగ్యాన్ని అక్కడి పాలకులు గాలికి వదిలేసారు. పరిస్థితి తీవ్రత అక్కడ పాలకులకు అర్ధం కావడం లేదు.

 

ప్రస్తుతం 150 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. అయినా సరే ప్రజలను పట్టించుకోవడం లేదు. బలపరీక్ష కోసం రాజకీయాలు చేస్తున్నారు. క్యాంపుల్లో ఉండి రాజకీయాలు నడిపిస్తున్నారు గాని తమకు ఓటు వేసిన ప్రజలను మాత్రం ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో పక్క రాష్ట్రాల నాయకులు మహారాష్ట్ర లో జరుగుతున్న రాజకీయంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో కూడా రాజకీయాలు చూస్తే మహారాష్ట్ర లోనే కాదు దేశంలోని ప్రజలకు ప్రమాదం చేకూరే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: