కరోనా మహమ్మారి భారతదేశంలో తన కోరలు చాచి నెమ్మదిగా విస్తరిస్తున్న సమయంలో ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. కొద్ది గంటల క్రితమే ప్రధాని మోడీ తన ప్రసంగంలో భారతీయులందరినీ ఇంట్లోనే ఉండమని సలహా ఇవ్వగా ఇప్పుడు బయటకు వచ్చిన వార్త ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది.

 

ఇండియన్ మెడికల్ అసోసియేషన్, కొచ్చిన్ బ్రాంచ్ వారు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ వల్ల కేరళ రాష్ట్రానికి మరొక 2.35 లక్షల ఐసియు బెడ్ రూమ్ అవసరమవుతాయని పేర్కొన్నారు. కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు వారు రాసిన లేఖలో తక్షణమే బయట ప్రజలు కలవడం మరియు అతి దగ్గరలో నడవడం వంటివి ఆపివేయాలని ఉత్తర్వులు జారీ చేయమని కోరారు. వైరస్ చాలా ప్రమాదకరంగా మారిందని ఇప్పుడైనా సరైన చర్యలు తీసుకోకపోతే దీన్ని ఆపడం ఎవరి తరం కాదని వారి లేఖలోని భావం.

 

తరువాత లేఖలో ఐఎంఏ వారు 3,700 మంది ఉన్న డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ లో 700 మంది వైరస్ ద్వారా బాధితులై ఉన్నారని…. దీనివల్ల వైరస్ వ్యాప్తి చెందే రేటు ఒక్కసారిగా 19 శాతానికి పెరిగిందని అనగా ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఐదుగురిలో ఒకరికి వైరస్ సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రకంగా కేరళ మొత్తం జనాభా బట్టి ఒక అంచనా వేసినా 19 శాతం అంటే దాదాపు 65 లక్షల మంది కోవిడ్-19 బారిన పడతారని వారు పేర్కొన్నారు.

 

వారిలో 15 శాతం మంది అనగా తొమ్మిది లక్షల 40 వేల మందికి హాస్పిటల్ లో చికిత్స అవసరం ఉండగా.. 25% మందికి అనగా రెండు లక్షల 35 వేల మందికి ఐసీయూ బెడ్ లు అవసరం. ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా ఏడు శాతం మంది అనగా 24 లక్షల మందికి కనీస చికిత్స అవసరం ఉండగా ప్రస్తుతం ఉన్న వ్యవస్థ అంత పని చేయలేదని వారు పేర్కొన్నారు.

 

 

ఇలా కేరళ చీఫ్ జస్టిస్ కు వారు రాసిన లేఖలో ప్రజలంతా అప్రమత్తమై ఒకరితో ఒకరు బయట కలవడం అనవసరంగా గుంపులుగుంపులుగా తిరగడం మరియు ఇంటి నుండి బయటకు రావడం వంటివి ఆపకపోతే జరిగే నష్టం ఎవరూ ఊహించని స్థాయిలో ఉండబోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: